Gold and Silver Price Today: బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే వార్తే. అందుకంటే రోజురోజుకు పరుగులు పెడుతున్న పసిడి ధరలు తాజాగా ఆదివారం నిలకడగా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి. మహిళలు అత్యంతగా ఇష్టపడే బంగారంకు భారతదేశంలో డిమాండ్ బాగా ఉంటుంది. అందుకే బంగారం ధరలపై చాలా మంది ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఇక పసిడి ధరలకు బ్రేకులు పడితే.. వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.
ఇక దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. తాజాగా కిలో బంగారంపై రూ.500 మేర పెరిగింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,300 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,300 ఉండగా, కోల్‌కతాలో రూ.69,300 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,300 ఉండగా, కేరళలో రూ.69,300 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 వద్ద కొనసాగుతోంది.
అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలుయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.