Gold and Silver Latest Prices: పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..! బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గొప్ప గుడ్‌న్యూస్ అని చెప్పాలి.. ఎందుకంటే.. గత వారం రోజులుగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. పగ్గాలు లేకుండా పరుగులు తీసిన బంగారం ధరలు దిగి వచ్చాయి. ఆగస్టు ఆరంభం నుంచి గోల్డ్ రేట్ బలహీనంగానే కొనసాగుతూ వస్తోంది. పసిడి బాటలోనే వెండి కూడా పయనించింది. వెండి రేటు కూడా భారీగా తగ్గుతూ వచ్చింది. శ్రావణ మాసం, పెళ్లిళ్లు, శుభకార్యాలకు సిద్ధపడుతున్న వారు బంగారం కొనేందుకు ఈ సమయం అనువైనదనే చెప్పాలి.
– దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,100 గా ఉంది.
– ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950, 24 క్యారెట్లు రూ.59,950.
– కేరళలో 22క్యారెట్ల బంగారం ధర 54,950, కాగా, 24క్యారెట్ల బంగారం ధరకు 59,950గా ఉంది.
– బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,950, 24 క్యారెట్లు రూ.59,950.
– చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,350, 24 క్యారెట్లు రూ.60,380 లుగా ఉంది.
– కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950. గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,950 గా ఉంది.
– ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000 లుగా కొనసాగుతోంది.
– ముంబైలో కిలో వెండి ధర రూ.75,000.
– చెన్నైలో కిలో వెండి ధర రూ78,500.
– బెంగళూరులో వెండి ధర రూ.76,000 లు ఉంది.
– హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500.
– విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,500లు గా ఉంది.
– విజయవాడలో రూ.78,500లుగా ఉంది.
ప్రస్తుతం శ్రావణ మాసంలో ఉన్నాం. మహిళలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వరలక్ష్మీ వ్రతాల కోసం బంగారం, వెండి కొనాలని భావించే వారు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను పరిశీలించుకుంటూ షాపింగ్ కోసం వెళితే బెటర్ అంటున్నారు నిపుణులు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు సిద్ధపడుతున్న వారు కూడా గోల్డ్ కొనేందుకు ఇదే అనువైన సమయంగా చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం ఈ రోజే మీకు ఇష్టమైన బంగారం, వెండి కొనేయండి..
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..