Brand india: బ్రాండ్ ఇండియాకు ప్రపంచ గుర్తింపు.. దేశంలో అవకాశాలు పుష్కలం

మన దేశం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. పౌరులందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే, వ్యాపార, పారిశ్రామిక రంగాలలో పురోగమిస్తోంది. తద్వారా అందరికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పలు దేశాలు ఇక్కడ పరిశ్రమలను స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నాయి. మన ప్రభుత్వాలు కూడా అనేక రాయితీలు కల్పిస్తూ ఆకర్షిస్తున్నాయి.

Brand india: బ్రాండ్ ఇండియాకు ప్రపంచ గుర్తింపు.. దేశంలో అవకాశాలు పుష్కలం
Soumitra Datta
Follow us
Srinu

|

Updated on: Dec 05, 2024 | 1:28 PM

నైపుణ్యం కలిగిన యువత, దేశంలో శాంతియుత రాజకీయాలు, సమర్థ వంతమైన నాయకత్వం, పెరుగుతున్న టెక్నాలజీ దీనికి కారణం. ఇటీవల కాలంలో బ్రాండ్ ఇండియాపై అన్ని దేశాలకు నమ్మకం ఏర్పడింది. పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశంగా మన దేశం మారుతోంది. బ్రాండ్ ఇండియా అంటే వ్యాపారాన్ని ఆకర్షించడానికి మన దేశం వాడుతున్న ఓ ప్రత్యేక పదం అని చెప్పవచ్చు. సేవారంగ, తయారీ, సమాచార సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎనేబుల్డ్ సేవలు తదితర వాటిలో మనం ప్రగతి సాధిస్తున్నాం. ఈ సామర్థ్యాన్ని తెలియజేసేదే బ్రాండ్ ఇండియా అని చెప్పవచ్చు.

ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సౌమిత్ర దత్తా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఇటీవల దేశం ఆర్థిక పురోగతి సాధించిందని, బ్రాండ్ ఇండియాపై ప్రపంచానికి అవగాహన పెరిగిందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి అనువైన దేశంగా మారిందన్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తాను విదేశాలకు వెళ్లినప్పుడు దీనికి భిన్నమైన వాతావరణం ఉండేదని వివరించారు. వ్యాపార, ఉత్పత్తి రంగాలకు సంబంధించి దేశంలో అనేక అవకాశాలు పెరుగుతున్నాయని దత్తా అన్నారు. భారత్ భవిష్యత్తులో ప్రపంచంలో చాలా కీలకంగా మారుతుందని, ఎక్కువ జనాభా, అతి పెద్ద మార్కెట్ కలిగి ఉండడం కూడా దీనికి కారణమన్నారు. ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతోందని, వీక్షిత్ భారత్ దిశాగా సాగుతున్న ప్రయాణంలో అనేక శక్తులు దేశానికి అండగా నిలుస్తున్నాయని దత్తా అన్నారు. 2047 నాటి అభివద్ది చెందిన దేశంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

గ్లోబ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సూచీలపై అనేక ప్రభుత్వాలతో దత్తా పనిచేశారు. ఫ్రం గ్రిడ్ లాక్ టు గ్రోత్ – హౌ లీడర్ షిప్ ఎనేబుల్స్ ఇండియాస్ ప్రగతి ఎకోసిస్టమ్ టు పవర్ ప్రోగ్రెస్ అనే పేరుతో ఇటీవల జరిగిన అధ్యయానికి సహ రచయితగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డీన్ గా పనిచేస్తున్నారు. అసోం లోని దిబ్రూఘర్, ధేమాజీ జిల్లాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై ఉన్న బోగీబీల్ వంతెనను దత్తా ప్రస్తావించారు. దేశంలోనే ఈ ప్రాంతానికి ఆర్థిక, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు కు మొదట 2002లో ఆమోదించారని, 2012 వరకూ పనులు ముందుకు సాగలేదన్నారు. 2015లో మోదీ ఈ ప్రాజెక్టును సమీక్షించారని, దాని అమలుపై శ్రద్ధ వహించి, 2018 నాటికి పూర్తి చేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..