Gautam Adani : సంపదలో రికార్డులు బ్రేక్ చేస్తున్న గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరులకు షాక్‌ల మీద షాక్‌లు..

|

Mar 13, 2021 | 6:05 PM

Gautam Adani : భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపదలో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ప్రపంచ కుబేరులకు నిద్రపట్టకుండా

Gautam Adani : సంపదలో రికార్డులు బ్రేక్ చేస్తున్న గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరులకు షాక్‌ల మీద షాక్‌లు..
Gautam Adani
Follow us on

Gautam Adani : భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపదలో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ప్రపంచ కుబేరులకు నిద్రపట్టకుండా చేస్తున్నారు. రోజు రోజుకు తన ఆదాయాన్ని పెంచుకొని ప్రపంచ ధనవంతులను వెనక్కి నెట్టారు. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్-1, నెంబర్ -2 స్థానాల్లో కొనసాగుతున్న అమెరికా దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్‌లను బీట్ చేశారు. ఈ ఎకనమిక్ ఈయర్‌లో అదానీ గ్రూప్స్ నికర ఆదాయం విలువ 16.2 బిలియన్లు పెరిగినట్లు ‘బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ వెల్లడించింది.

తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం అదానీ ఆస్తుల నికర విలువ 2021లో 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదానీకి గ్రూప్స్‌కు చెందిన ఎనర్జీ, పవర్, ట్రాన్స్మిషన్, ఎంటర్ ప్రైజెస్, గ్యాస్, పోర్ట్స్ మరియు సెజ్‌ మొదలగు రంగాల్లో సంపద ఈ ఏడాది 90 శాతం పెరిగినట్లు బ్లూ బర్గ్ అంచనా వేసింది. మరోవైపు ఆసియాలో అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్న ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ 8.1 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే.

కరోనా వ్యాప్తి కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నా.. మరోవైపు భారతీయ బిలియనీర్లు మరింత సంపన్నులయ్యారు. కరోనాను కూడా వారికి అనుకూలంగా మార్చుకొని లాభాలను గడించారు. ఆసియా సంపన్నుడు ముఖేష్ అంబానీ అందరి కంటే ఎక్కువగా సంపాదించాడు. ఆరు నెలల పాటు గంటకు రూ.90 కోట్లు సంపాదించాడంటే ముఖేష్ అంబానీ ఏ స్థాయిలో ఎదిగారో ఊహించవచ్చు. ఏకంగా ఈ ఏడాదిలో తన సంపదను 73 శాతం పెంచుకున్నారు.

Ukrainian Couple : వీరిద్దరు చేతులకు సంకెళ్లు వేసుకొని ప్రేమించుకుంటున్నారు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోగలరా..! ట్రై చేయండి.. ఫన్నీ వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..

ఆ ప్రాంతాల్లో వానర వనాలుగా మారిన ఊర్లు.. జనాభా కంటే కోతులే ఎక్కువయ్యాయి.. జనాల్ని టార్చెర్ చేస్తున్నాయి