ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ ఆదానీ వ్యక్తిగత సంపద భారీగా పడిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆదానీ ఏడవ స్థానానికి పడిపోయారు. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. వ్యక్తిగత సంపద దాదాపు 22.5 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయి 96.8 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడింది. ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ తర్వాతీ స్థానానికి గౌతం అదానీ పడిపోయారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్ వ్యక్తిగత సంపద 104.1 బిలియన్ డాలర్లు.
దీనికి ప్రతికూల పరిస్థితులు కూడా తోడు కావడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. శుక్రవారం అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు ముదుపర్లను నష్టాల్లో ముంచెత్తాయి. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలోఉన్న గౌతమ్ ఆదానీ ఒక్కసారిగా దిగువకు పడిపోయారు. 2022 సంవత్సరంలో జెట్‌స్పీడ్‌తో దూసుకుపోయిన అదానీ ఆదాయం.. 2023 సంవత్సరంలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే మార్కెట్ క్యాప్ రూ. 2.37లక్షల కోట్లు తగ్గుముఖం పట్టింది. దీని కారణంగా గౌతమ్ అదానీ నికర విలువ రూ. 100.4 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఏడవ ర్యాంకుకు పడిపోయాడు.
ఆదానీ జూన్ 24, 1962లో పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడి నుంచే వచ్చారు. 10వ తరగతి పూర్తయ్యాక, 15 ఏళ్ల వయసులో చదువు మానేశారు. అతను 1988లో కమోడిటీస్ ట్రేడింగ్‌తో ప్రారంభించి ఆదానీ గ్రూప్‌ను స్థాపించారు. ఆదానీ డెంటిస్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన కరణ్, జీత్ అనే ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు కరణ్ ఆదానీ పోర్ట్స్, యునైటెడ్ స్టేట్స్‌లోని పర్డూ విశ్వ విద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్ర పట్టా పొందారు. దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ న్యాయ సంస్థలలో ఒకటైన సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధిని వివాహం చేసుకున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి