Indian Railways: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి వచ్చిన ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

|

Oct 29, 2021 | 7:48 PM

Indian Railways: రవాణా రంగంలో అతిపెద్ద వ్యవస్థ అంటే అది రైల్వే శాఖనే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను..

Indian Railways: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి వచ్చిన ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..
Follow us on

Indian Railways: రవాణా రంగంలో అతిపెద్ద వ్యవస్థ అంటే అది రైల్వే శాఖనే అని చెప్పాలి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇక రైల్వే శాఖ ఎయిర్ కండీషన్డ్​త్రీ టైర్​ఎకానమీ క్లాస్​కోచ్‌లను ప్రారంభించింది. అక్టోబర్‌ 29 నుంచి ఆనంద్‌ విహార్‌ టెర్మినల, పాట్నా జంక్షన్‌ మధ్య గతి శక్తి సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలు ప్రారంభం అయ్యింది.  అయితే గతిశక్తి ఎక్స్‌ప్రెస్‌ మొదటిసారి నూతనంగా ప్రవేశపెట్టిన ఎసీ-3 టైర్‌ ఎకనామి కోచ్‌లతో ఉంటుంది. ఈ రైలు నవంబర్‌ 7 వరకు మొత్తం ఐదు ట్రిప్పులు చేయనుంది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం, అలాగే పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దని దృష్టిలో ఉంచుకుని నార్త్‌ రైల్వే పాట్నా- ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ గతి శక్తి సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

గతి శక్తి ఎక్స్‌ప్రెస్‌ సమయాలు..
నార్త్‌ రైల్వే వివరాల ప్రకారం..  01684 ప్రత్యేక రైలు ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ -పాట్నా జంక్షన్‌ గతి శక్తి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆనంద్‌ విహారం టెర్మినల్‌ నుంచి అక్టోబర్‌ 29న, 31, నవంబర్‌ 2, 5 మరియు నవంబర్‌7వ తేదీల్లో రాత్రి 11.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు పాట్నా జంక్షన్‌కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయణంలో 01683 గతి శక్తి సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ పాట్నా జంక్షన్‌ నుంచి అక్టోబర్‌ 30, నవంబర్‌ 1, 3, 6, 8వ తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరుతుంది. ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ వద్దకు 9.50కి చేరుకుంటుంది.

01684/01683 గతి శక్తి ప్రత్యేక రైలు ఎకనామీ ఏసీ త్రీ టైర్‌ కోచ్‌లు ఉంటాయి. ఇది కన్పూర్‌ సెంట్రల్‌, ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌, వారణాసి, పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌, దానాపూర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌-జైపూర్‌, ప్రయాగ్‌రాజ్‌ – జైపూర్‌, ప్రయాగ్‌రాజ్‌-ఉదంపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ త్రీటైర్‌ ఎకానమీ కోచ్‌లను నడుపుతోంది.

అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకైన, ఉత్తమమైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రారంభించారు. ఈ కోచ్‌లలో ఛార్జీలు ఏసీ త్రీ-టైర్, నాన్- ఏసీ స్లీపర్ క్లాస్ మధ్య ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ(ఆర్‌సిఎఫ్) చేత రూపొందించబడింది. దీని రూపకల్పన 2020 అక్టోబర్‌లో ప్రారంభమైంది. రైళ్లలో ఈ నూతన ఎస్​3 టైర్ ఎకానమీ కోచ్‌లను చేర్చడం ద్వారా ప్రస్తుతం 72గా ఉన్న బెర్త్​ల సంఖ్య 83కి పెరిగింది. ఇక ఈ ఎకనామీ ఏసీ-3 టైర్‌ రైళ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. సాధారణ టైర్‌ కోచ్‌ల కంటే 8 శాతం తక్కువగా ఎకనమీ ఏసీ-3 ఛార్జీలు ఉంటాయి. అయితే డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఏ జోన్‌కైనా కనీసం 16 నుంచి 18 కోచ్‌లు అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ కోచ్‌లను సెప్టెంబర్‌లో అనేక రైళ్లను జొడించినా.. ఇక మరిన్ని రైళ్లను నడపనుంది.

అదనపు బెర్తులు..
ఈ ఎకనమీ ఏసీ-3 కోచ్‌లో 83 బెర్తులు ఉంటాయి. అంతేకాక సాధారణ ఏసీ3 టైర్‌ కోచ్‌ల కంటే అదనంగా 11 బెర్తులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణీకుల సామర్థ్యం మరింతగా పెరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి కోచ్‌లో వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక స్నేహపూర్వక టాయిలెట్​ను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి డిజైన్‌లో అనేక మార్పులను కూడా చేసింది.

రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం..
ప్రతి కోచ్‌లో మోడరన్​డిజైన్​తో రూపొందించిన సీట్లు, బెర్తులను చేర్చింది. ఫోల్డబుల్ స్నాక్​టేబుల్స్​, వాటర్​ బాటిల్స్, మొబైల్ ఫోన్, మ్యాగజైన్‌ల కోసం ప్రత్యేక హోల్డర్లను అందించింది. స్టాండర్డ్​ సాకెట్‌తో పాటు ప్రతి బెర్త్‌కు వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. మధ్య, ఎగువ బెర్తులను యాక్సెస్ చేయడానికి నిచ్చెనలో ఎర్గోనామిక్‌గా మెరుగైన డిజైన్‌ను కూడా అందించింది. అంతేకాక, మధ్య, ఎగువ బెర్తులలో హెడ్‌రూమ్‌ను పెంచింది.

ఇందులో లాటరీన్​డిజైన్‌ను అందించింది. ప్రయాణికుల సౌకర్యాలలో భాగంగా పబ్లిక్ అడ్రస్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసింది. కోచ్‌లోకి ప్రవేశించే ప్రవేశ ద్వారం సౌలభ్యంగా ఉండేలా మెరుగుపర్చింది. కోచ్ లోపల ప్రకాశించే ల్యుమినిసెంట్ గుర్తులను ఏర్పాటు చేసింది. బెర్త్ నంబర్లు ప్రకాశవంతంగా కనిపించేందుకు ఇల్యుమినేటెడ్ బెర్త్​ ఇండికేటర్స్‌ను ఉంచింది. కోచ్​లోపల మెరుగైన అగ్ని భద్రత చర్యలను కూడా అందించింది. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి నుంచి సురక్షితంగా బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

అయితే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గతంలో మొత్తం 248 రైళ్లలో ఎసి3 టైర్​ఎకానమీ క్లాస్​ కోచ్‌లను ఏర్పాటు చేయగా, ఈ కోచ్‌ల ఉత్పత్తి ఈ నెల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఇది ప్రయాణికుల సంఖ్య పెరగడానికి, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ రైలు ప్రయాణం ఆహ్లాదకరమైన జ్ఞాపకాల ప్రయాణంగా మారుతుందని రైల్వే శాఖ పేర్కొంది.

 

 

ఇవి కూడా చదవండి:

EPF: ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 6 కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే బెనిఫిట్‌..!

Sukanya Samruddhi Yojana: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.12,500 డిపాజిట్‌తో రూ. 70 లక్షల బెనిఫిట్‌..!