AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder Booking on Amazon: అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి ఇలా.. రూ. 50 క్యాష్‌బ్యాక్‌

Gas Cylinder Booking on Amazon: ప్రస్తుత రోజుల్లో వంట గ్యాస్‌ బుకింగ్‌ అనేది ముఖ్యమైపోయింది. గతంలో గ్యాస్‌ బుకింగ్‌ చేసుకునేందుకు సంబంధిత కార్యాలయానికి వెళ్లి క్యూలైన్‌లో...

Gas Cylinder Booking on Amazon: అమెజాన్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి ఇలా.. రూ. 50 క్యాష్‌బ్యాక్‌
Subhash Goud
|

Updated on: Feb 19, 2021 | 3:52 PM

Share

Gas Cylinder Booking on Amazon: ప్రస్తుత రోజుల్లో వంట గ్యాస్‌ బుకింగ్‌ అనేది ముఖ్యమైపోయింది. గతంలో గ్యాస్‌ బుకింగ్‌ చేసుకునేందుకు సంబంధిత కార్యాలయానికి వెళ్లి క్యూలైన్‌లో నిలబడి గ్యాస్‌ బుకింగ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ప్రస్తుతం కాల మారిపోయింది. గ్యాస్‌ బుకింగ్‌ చేసుకునేందుకు వివిధ యాప్‌ల ద్వారా కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో కూడా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకునే వెలుసుబాటు కల్పించింది.

అమెజాన్‌లో గ్యాస్‌ బుకింగ్‌ ఎలా చేయాలి..?

– ముందుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేయాలి. – ఆ తర్వాత Amazon Pay పైన క్లిక్ చేయాలి. – స్క్రోల్ డౌన్ చేస్తే Book your LPG Cylinder బ్యానర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. – ఆ తర్వాత Pay Now పైన క్లిక్ చేయాలి. – మీ గ్యాస్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేయాలి. – ఆ తర్వాత ఎల్‌పీజీ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. – Get Booking Details పైన క్లిక్ చేయాలి. – కస్టమర్ పేరు, బిల్ వివరాలు కనిపిస్తాయి. – Continue to Pay పైన క్లిక్ చేయాలి. – ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.

అమెజాన్‌లో వంట గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత రూ.50 క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది. మొదటి సారి సిలిండర్‌ బుక్‌ చేసిన వారికే ఈ రూ.50 క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్‌కు సంబంధించిన నియమ నిబంధనలు అమెజాన్‌ యాప్‌లో ఉంటాయి. ఈ వివరాలను చదివిన తర్వాత బుకింగ్‌ చేయాల్సి ఉంటుంది.

Also Read: Hydrogen Fuel Car: త్వరలోనే మార్కెట్లోకి రానున్న హైడ్రోజన్‌ కార్లు.. పైలెట్‌ ప్రాజెక్టుగా ఢిల్లీలో ప్రారంభం