Gold: బంగారు నగలు కొనేటప్పుడు ఈ చిన్న పని చేయండి! చోరీ అయినా కూడా మీ డబ్బు సేఫ్..!
బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఆభరణాల వ్యాపారులు ఉచిత బంగారం బీమా అందిస్తారని చాలామందికి తెలియదు. ఈ బీమా ద్వారా దొంగతనం, నష్టం, ప్రమాదాల బారిన పడిన బంగారానికి 95 శాతం వరకు పరిహారం పొందవచ్చు. మీ బంగారాన్ని రక్షించుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

మన దేశంలో బంగారాన్ని శ్రేయస్సు, సంపదకు చిహ్నంగా భావిస్తారు. పండుగలు, ఇతర శుభ సందర్భాలలో బంగారం కొనుగోలు చేస్తారు. కానీ బంగారం ధరించడం ఇప్పుడు అంత సులభం కాదు. భారీ ధరలతో పాటు బంగారు దొంగల ముఠాలు ఎక్కువైపోయాయి. అనేక నగరాల్లో మహిళల మెడ నుండి బంగారు గొలుసులు, మంగళసూత్రాలను లాక్కునే సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటు వేలకు వేలు పోసి కొన్న బంగారు ఆభరణాలు పోగొట్టున్నవారు పెరిగిపోతున్నారు.
అయితే చాలా సందర్భాల్లో బంగారం దొంగతనం కేసుల్లో మీ బంగారం రికవరీ అవ్వకపోవచ్చు. కానీ, మీరు ఒక ఆభరణాల వ్యాపారి నుండి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు, మీకు దానిపై ఉచిత బీమా లభిస్తుంది. బంగారం పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు మీ డబ్బు మీకు లభిస్తుంది. అలాంటి ఒక బీమా ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అనేక ఆభరణాల వ్యాపారులు, బంగారు దుకాణాలు, మలబార్, తనిష్క్, సాంకో గోల్డ్, డైమండ్స్ వంటి కంపెనీలు కొనుగోలుదారులకు ఉచిత బీమాను అందిస్తున్నాయి. కానీ చాలా మంది కస్టమర్లకు దీని గురించి తెలియదు. కొనుగోలు చేసేటప్పుడు మీరు దీని గురించి విచారించవచ్చు. మీరు ఆభరణాల వ్యాపారుల నుండి బంగారం కొనుగోలు చేసినప్పుడు, ఈ ఉచిత బీమా అందించబడుతుంది. ఈ బీమా పాలసీ మీ బంగారం నష్టాన్ని భర్తీ చేస్తుంది. భూకంపం, విదేశీ దాడి, వరదలు, అల్లర్లు, చైన్ స్నాచింగ్, దోపిడీ, ప్రమాదం కారణంగా బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నా, దెబ్బతిన్నా మీరు దాని కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ బీమా పాలసీలో మీరు తయారీ ఛార్జీలు, పన్నులు చెల్లించాలి. ఈ బీమా పాలసీ కింద కస్టమర్‌కు నగల విలువలో 95 శాతం వరకు బీమా కవర్ అందించబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




