Flipkart Big Saving Days Sale: మరో బంపర్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానున్న ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..!

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మళ్లీ వినియోగదారుల ముందుకు రానుంది. ఇప్పటికే గత నెల 27, 29 తేదీల్లో ఉన్న..

Flipkart Big Saving Days Sale: మరో బంపర్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు రానున్న ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటి నుంచి అంటే..!
Flipkart

Updated on: Aug 03, 2021 | 6:27 AM

Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మళ్లీ వినియోగదారుల ముందుకు రానుంది. ఇప్పటికే గత నెల 27, 29 తేదీల్లో ఉన్న ఈ సేల్‌లో ఎన్నో ఆఫర్లు సొంతం చేసుకున్నారు కస్టమర్లు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌తో ముందుకు వస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై గొప్ప తగ్గింపును ఇస్తోంది. అలాగే క్రెడిట్‌ కార్డులపై కూడా రాయితీలు ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్‌. ఐసీఐసీ, యాక్సిస్‌ కార్డుదారులకు సుమారు 10శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది.

గత నెలలో ఉన్న ఈ సేల్స్‌లో మొబైల్‌ ఫోన్‌లపై ఎన్నో ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు.. ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై కూడా ఆఫర్లు ప్రకటించింది. ఈఎంఐ ఆప్షన్‌లో నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ప్రకటించింది. తాజాగా ప్రకటించే ఆఫర్లలో ఎలక్ట్రానిక్‌ పై 50 శాతం వరకు డిస్కౌంట్‌, మొబైల్‌ ఫోన్‌లపై 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్‌, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌, టీవీలు, ఇతర ఉపకరణాలు కనీసం 60 శాతం వరకు డిస్కౌంట్‌, ల్యాప్‌టాప్‌లకు 35 నుంచి 50 శాతం వరకు బ్యాంకు కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి

PM Kisan Scheme: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ డబ్బులు.. ఎప్పుడంటే..?

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నారా.. ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే..!