Flipkart: దసరా, దీపావళి పండగ సీజన్ వచ్చేసింది. ఇందులో భాగంగా పలు ఆన్‌లైన్ దిగ్గజాలు వినియోగదారులకు భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. చాలా మంది స్మార్ట్‌టీవీలు, ఫ్రిజ్, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇలా షాపింగ్ చేసేవారికి ఫ్లిప్‌కార్ట్ మంచి అవకాశం అందిస్తోంది అదే ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ (Flipkart Pay Later). ఇందులో భాగంగా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.70 వేల వరకు షాపింగ్ చేసే వెసులుబాటు కల్పిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఆ మొత్తాన్ని షాపింగ్ కోసం వాడుకుని వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఉంటుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆఫర్ కొత్తదేమీ కాదు. గతంలో ఉన్నదే. కానీ గతంలో క్రెడిట్ లిమిట్ కేవలం రూ.3000, రూ.10,000 మాత్రమే ఉండేది. అంటే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు పే లేటర్ ఆప్షన్ ద్వారా గరిష్టంగా రూ.10వేలు మాత్రమే క్రెడిట్ పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ క్రెడిట్ లిమిట్‌ను పెంచింది ఫ్లిప్‌కార్ట్. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్టు.. భారీ ఆఫర్లను ప్రకటించింది.
కాగా, క్రెడిట్ లిమిట్‌ను ఏకంగా రూ.10 వేల నుంచి రూ.70 వేల వరకు పెంచేసింది. ఈ మొత్తంతో కస్టమర్లు స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్, రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేయవచ్చు. మీరు కనుక ఈ ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా షాపింగ్ చేస్తున్నట్లు ఓ సారి చెక్ చేసుకోండి డబ్బులు క్రెడిట్ అయ్యాయా లేదా అని. రెగ్యూలర్‌గా ఈ ఆప్షన్ ద్వారా షాపింగ్ చేస్తే మీరు ప్రతి నెల ఎంత మొత్తంలో షాపింగ్ చేస్తున్నారో దానిని బట్టి మీకు రూ.10వేల నుంచి రూ.70 వేల వరకు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లోని 10 కోట్ల మందికి పైగా కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లభిస్తోంది. వారంతా పే లేటర్ ఆప్షన్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పే లేటర్ ఆప్షన్ ద్వారా క్రెడిట్ లిమిట్ పొందాలంటే కస్టమర్లు తప్పనిసరిగా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. బ్యాంకు అకౌంట్ వివరాలు వెల్లడించాలి. ఆ తర్వాతే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ యాక్టివేట్ ఆప్షన్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు నచ్చిన ప్రొడక్ట్ కార్ట్‌లో యాడ్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ సెక్షన్‌లో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎంత ఈఎంఐ చెల్లించాలో అక్కడ వివరాలు ఉంటాయి. దానిని బట్టి మీరు ఎంచుకోవాలి. ఆ తర్వాత ప్రతీ నెలా ఈఎంఐ మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఇలా కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ ఇలా ఒక్క రూపాయి లేకుండానే రూ. 70 వేల వరకు షాపింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.