ఆగష్టు 5న అమెజాన్ తన రాబోయే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌ను ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్ట్ 4న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్ నుంచి ఎలక్ట్రానిక్ ఉపరికరాల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. వీటితోపాటు గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులు కూడా తక్కవ ధరకే అందుబాటులో ఉన్నాయి.
కాగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ఆగష్టు 3 మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, కోటక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్డ్ ప్రకటించింది. వీటిటో పాటు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 11 భారతదేశంలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 రూ.68,999లకు, ఐఫోన్ 11 రూ. 41,999లకు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరపై భారీగా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు కొన్ని 5G ఫోన్‌లపై భారీ తగ్గింపులను కూడా ప్రకటించింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే ఆగస్ట్ 4వరకు వేచి చూస్తే బెటర్ ప్రైజ్‌కు ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే సేల్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్‌పై కూడా డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మినీ సిరీస్ స్థానంలో ఆపిల్ 2022లో ప్లస్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.
ఐఫోన్‌లతో పాటు Samsung Galaxy S22+ కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం రూ. రూ. 59,999కి అందుబాటులో ఉంది. అయితే ఇది తక్కువ ధరకే విక్రయించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా, Pixel 6a, Samsung Galaxy Z Flip 3 లాంటి ఇతర ఫోన్‌లు కూడా తక్కువ ధరకే సేల్‌కు రానున్నాయి. ఈ 5G ఫోన్‌ల ఖచ్చితమైన ధర రాబోయే రోజుల్లో లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈవెంట్‌కు ముందు వెల్లడికానున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..