Flight Ticket Prices: కేంద్ర ప్రభుత్వం మరో షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న విమాన టికెట్ ధరలు

light Ticket Prices: దేశీయ విమానాలకు సంబంధించి కేంద్ర సర్కార్‌ ప్రయాణికులకు ఓ షాకింగ్‌ లాంటి వార్త వినిపించింది. దేశీయ విమానాల లోయర్‌ ఎ...

Flight Ticket Prices: కేంద్ర ప్రభుత్వం మరో షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న విమాన టికెట్ ధరలు
Flight

Updated on: Mar 20, 2021 | 9:59 AM

Flight Ticket Prices: దేశీయ విమానాలకు సంబంధించి కేంద్ర సర్కార్‌ ప్రయాణికులకు ఓ షాకింగ్‌ లాంటి వార్త వినిపించింది. దేశీయ విమానాల లోయర్‌ ఎయిర్‌ఫేర్‌ బ్యాండ్‌ను 5శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఇది రెండో సారి పెంపు. ఫిబ్రవరిలో ఓ సారి దేశీయ విమానాల ఫేర్‌ లిమిట్స్‌ పెంచింది. తాజాగా రెండోసారి దేశీయ విమానాల్లో టికెట్ల ధరలు పెరిగే అవకాశాలుంటాయి. విమానాల ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల దిగువ స్థాయి ఛార్జీలను 5శాతం పెంచుకోవచ్చనే నిర్ణయం తీసుకున్నామని, రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఒక నెలలో మూడు సార్లు, 3.5 లక్షలు దాటితే వందశాతం ఆపరేషన్స్‌ జరిపేందుకు అనుమతి ఇస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి తెలిపారు. అలాగే కొన్ని రోజులుగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేయించుకుని రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. అందుకే అనుమతించదగ్గ పరిమితిని 80 శాతానికి పరిమితం చేస్తున్నామని హర్దీప్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.

ఫిబ్రవరిలో ఇంధన వ్యయాల ధరలు పెరగడంతోకేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసుల ఎగువ స్థాయి, దిగువ స్థాయి ఛార్జీల పరిమితిని 10-30 శాతం పెంచింది. అయితే గత ఏడాది మే న ఎలలో విమానయాన శాఖ దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినప్పుడు దేశీయ విమాన సర్వీసుల రూట్లు, విమానాల ప్రయాణ కాలం అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ఏడు బ్యాండ్లుగా విభజించి ధరలపై పరిమితులు పెట్టింది. మొదటి బ్యాండ్‌ అనేది 40 నిమిషాల్లోపే ప్రయాణం పూర్తయ్యే విమానం. ఇప్పుడు దాని దిగువ స్థాయి టికెట్‌ ధర శుక్రవారం నాటికి రూ.2,310కి చేరింది. ఇక180 నుంచి 120 నిమిషాల పాటు ప్రయాణించే అత్యధిక స్థాయి విమానాల్లో దిగువ స్థాయి పరిమితి రూ.7,560కి చేరింది. కాగా, భారత్‌లో కరోనా కారణఃగా మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు. అయితే ఇంటర్నేషనల్‌ విమానాలు మాత్రం జూలై 2020 నుంచి ఎయిర్‌ బబుల్‌ సౌకర్యాలతో నడుస్తున్నాయి.

 

 

ఇవీ చదవండి :

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?