Travel Alert: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 40% తగ్గనున్న విమాన ఛార్జీలు..

Travel Alert: గత కొంత కాలంగా కరోనా నేపథ్యంలో.. అంతర్జాతీయంగా పరిమిత సర్వీసులు(International Flights) నడిపేందుకే ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. ఈ కారణంగా విమాన ప్రయాణ ఛార్జీలు(Flight Charges) పెరిగి మోయలేని భారంగా మారాయి.

Travel Alert: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 40% తగ్గనున్న విమాన ఛార్జీలు..
Flights

Updated on: Mar 11, 2022 | 8:02 AM

Travel Alert: గత కొంత కాలంగా కరోనా నేపథ్యంలో.. అంతర్జాతీయంగా పరిమిత సర్వీసులు(International Flights) నడిపేందుకే ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. ఈ కారణంగా విమాన ప్రయాణ ఛార్జీలు(Flight Charges) పెరిగి మోయలేని భారంగా మారాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే భారత్‌- అమెరికాతో పాటు మరికొన్ని మార్గాల్లో కరోనాకి మునుపు కంటే ఛార్జీలు డబుల్ అయ్యాయి. ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో.. ఛార్జీల విషయంలో ప్రయాణికులకు ఊరట లభించే అవకాశాలున్నాయి. సర్వీసులు పెరుగుతాయి కనుక రానున్న రోజుల్లో విమాన ఛార్జీలు 40 శాతం వరకు తగ్గవచ్చని విమానయాన వర్గాలు భావిస్తున్నాయి.

లుఫ్తాన్సా, ఆ గ్రూపునకు చెందిన స్విస్‌ సంస్థలు రాబోయే కొన్ని నెలల్లో రెట్టింపు సంఖ్యలో విమానాలు నడపాలని అనుకుంటున్నాయి. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా విమాన సర్వీసుల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని నెలల్లో 100 అంతర్జాతీయ విమానాల సర్వీసులు పునరుద్ధరించనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.  ప్రస్తుతం ఆయా దేశాలతో ఉన్న ఎయిర్‌ బబుల్‌ ఒప్పందాల మేరకు పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇలా పరిస్థితులు కరోనా కంటే మునుపటి స్థాయిలకు చేరతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలు ధరల తగ్గుదలకు అడ్డుపడనున్నాయా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలను ఎంతవరకు తగ్గిస్తాయనేది వేచి చూడాల్సిన అంశంగానే ఉంది. దేశీయంగా చూస్తే, ఈ ఏడాది ఇప్పటికే విమాన ఇంధన ధరలను ఐదు సార్లు పెరిగాయి. 2021లో ఏకంగా విమాన ఇంధన ధరలు 100 శాతం మేర పెరిగాయి.  యుద్ధం కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇవీ చదవండి..

Multibagger Returns: ఏడాదిలో లక్షను.. రెండు లక్షలు చేసిన స్టాక్.. అందులోనూ టాటాలు వాటాలు కొన్న షేర్..

Viral Video: డాడీ నువ్వు మాతో వచ్చెయ్.. యుద్ధ భూమిలో ఆ సంఘటన చూస్తే మీకు కన్నీళ్లు రాక మానవు..