మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే ఆర్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల విషయంలో నిబంధనలు మారాయి. ఆర్బీఐ కొంతకాలం క్రితం ఎఫ్‌డీకి సంబంధించిన నిబంధనలను మార్చింది. రెపో రేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఆర్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీరు మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోతే, మీరు దానిపై తక్కువ వడ్డీని పొందుతారు. ఈ వడ్డీ సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీకి సమానంగా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు సాధారణంగా 5 నుండి 10 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5% కంటే ఎక్కువ వడ్డీని అందిస్తాయి. పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు 3 శాతం నుండి 4 శాతం వరకు ఉంటాయి. ఈ మేరకు ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది
ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయి ఆ మొత్తాన్ని చెల్లించకపోయినా లేదా క్లెయిమ్ చేయకపోయినా పొదుపు ఖాతా ప్రకారం దానిపై వడ్డీ రేటు లేదా మెచ్యూర్డ్ ఎఫ్‌డిపై నిర్ణయించిన వడ్డీ రేటు, ఏది తక్కువ అయితే అది ఇవ్వబడుతుంది. ఈ కొత్త నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకుల్లో డిపాజిట్లపై వర్తిస్తాయి.
ఇంతకు ముందు మీ ఎఫ్‌డీ మెచ్యూర్ అయినప్పుడు, మీరు దానిని ఉపసంహరించుకోకపోతే లేదా క్లెయిమ్ చేయకపోతే, మీరు ఇంతకు ముందు ఎఫ్‌డీ చేసిన అదే కాలానికి బ్యాంక్ మీ ఎఫ్‌డీని పొడిగించేది. కానీ ఇప్పుడు అది జరగదు. కానీ ఇప్పుడు మెచ్యూరిటీలో డబ్బును విత్‌డ్రా చేయకపోతే దానిపై ఎఫ్‌డీ వడ్డీ లభించదు. అందుకే మెచ్యూరిటీ అయిన వెంటనే డబ్బు విత్‌డ్రా చేసుకుంటే మంచిది. పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీ కంటే ఎఫ్‌డీపై వచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటే మీరు మెచ్యూరిటీ తర్వాత పొదుపు ఖాతాపై వడ్డీని పొందుతారు.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం