Fixed Deposit: భారతీయ పౌరులు పొదుపును ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకోసం రకరకాల మార్గాలను వెతుకుతారు. తమ డబ్బులు ఎక్కడ పెట్టుబడిపెడితే భద్రంగా ఉంటాయో ఆరా తీస్తూ ఉంటారు. చాలామంది బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఎందుకుంటే ప్రభుత్వ నుంచి సెక్యూరిటీ, మంచి రాబడి వస్తోందని నమ్ముతారు. అయితే అన్ని బ్యాంకులు వడ్డీలు ఒకే విధంగా చెల్లించవు. కొన్ని బ్యాంకులు అధికంగా వడ్డీ చెల్లిస్తాయి. 5 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ బ్యాంకులో ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు FD చేస్తే మీకు 5.30 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తోంది. అంటే వారికి 5.80 శాతం వడ్డీ అందిస్తుంది. ఈ రేటు జనవరి 1, 2021 నుంచి అందుబాటులో ఉంది.
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల తన FD రేటును మార్చింది. ప్రస్తుతం బ్యాంక్ 3 నుంచి 5 సంవత్సరాల వరకు FD ప్లాన్‌లపై 5.25 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వడ్డీని చెల్లిస్తారు.
3. బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మాట్లాడితే.. 3 నుంచి 5 సంవత్సరాల వరకు కస్టమర్‌లకు 5.25 శాతం వడ్డీని ఇస్తోంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేటు 16 నవంబర్ 2020 నుంచి వర్తిస్తుంది.
4 HDFC బ్యాంక్
HDFC బ్యాంక్ 21 మే 2021న తన వడ్డీ రేటును మార్చింది. ప్రస్తుతం బ్యాంక్ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు FD ప్లాన్‌లపై 5.30 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు ఈ రేటు 5.80 శాతం ఉంది.