Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో వారానికి రెండు రోజుల సెలవులు!
బ్యాంకు ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరే సమయం ఆసన్నమైంది. వారానికి రెండు రోజులు సెలవులు (2 వీక్లీ సెలవులు) ఇవ్వనున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వారానికి ఐదు రోజుల పని, 2 వారాల సెలవు సౌకర్యం, మరికొన్ని..
బ్యాంకు ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరే సమయం ఆసన్నమైంది. వారానికి రెండు రోజులు సెలవులు (2 వీక్లీ సెలవులు) ఇవ్వనున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ వారానికి ఐదు రోజుల పని, 2 వారాల సెలవు సౌకర్యం, మరికొన్ని సమస్యలపై జూలై 28 న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూలై 28 న బ్యాంక్ యూనియన్లు, IBA మధ్య సమావేశం జరగనుంది. ఈ సమయంలో వారంలో ఐదు రోజుల పని, జీతాల పెంపు, రిటైర్ అయిన వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ తదితర అంశాలపై చర్చించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ముందుగా అంటే జూలై 19 బ్యాంకు పనిదినాల సమస్యపై ఐబీఏ చర్చించిందని తెలిపింది. బ్యాంకు పనిదినాలను ఐదుకు తగ్గించే ఆలోచనతో సంబంధిత వర్గాలతో మాట్లాడుతున్నట్లు ఐబీఏ తెలియజేసిందని బ్యాంకుల ఫోరమ్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం బ్యాంకులకు వారానికోసారి సెలవులు ఉంటాయి. నెలలో రెండు శనివారాలు సెలవు. ఒక నెలలో బ్యాంకులకు 6 నుంచి 7 సెలవులు ఉంటాయి. అయితే ఈ నిర్ణయం అమలై వారానికి రెండు సెలవులు పొందినట్లయితే, గ్యారెంటీ సెలవుల సంఖ్య 8 నుండి 10 కి పెరుగుతుంది.
బ్యాంకు ఉద్యోగులు రెండు వారాల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేయడంపై తమకు అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే బ్యాంకు ఉద్యోగులకు వారంలో రెండు వారాలు సెలవులు ఇస్తే వారి పని వేళలను 40 నిమిషాలు పొడిగించాలని ఐబీఏ ప్రభుత్వానికి సూచన చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి