First Maruti Suzuki EV: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకీ త్వరలో తమ ఎలక్ట్రిక్ కార్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతా సవ్యంగా జరిగితే 2025 నాటికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కార్ల ధర కూడా అతి తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. మార్కెట్ వర్గాల ప్రకారం తమ ఎలక్ట్రిక్ కార్లను రూ.10 లక్షల లోపే ఉండేలా కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం.. కాంపాక్ట్ కార్ విభాగంలో జపనీస్ కార్ల తయారీదారు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వేగంగా వెళ్ళడానికి ఇది ఎంతగానో సహాయపడుతోంది. మారుతి సుజుకి ఇండియా ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుంది. జపాన్ కార్ల తయారీ ఆసియా మార్కెట్లలో బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో మారుతి సుజుకి అమ్మకాలు ఎక్కువగా ఆల్టో, వాగన్-ఆర్, బాలెనో, స్విఫ్ట్ వంటి చిన్న, కాంపాక్ట్ కార్లచే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఆసియాలోని ఒక ఇంగ్లిష్ వెబ్‌సైట్ ప్రకారం.. కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని మొదట భారతదేశంలో, ఆపై సుజుకి హోమ్ బేస్ జపాన్‌తోపాటు యూరప్ వంటి ఇతర మార్కెట్లలో విడుదల చేయనున్నారు. మారుతి సుజుకీ గత కొంతకాలంగా భారతీయ రోడ్లపై వాగన్-ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరీక్షిస్తోంది.