
వ్యాపారులతో పాటు కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి సొమ్ము తప్పనిసరి. ముఖ్యంగా మనం పెట్టిన పెట్టుబడితోనే ఖాతాదారులను ఆకట్టుకోవడం సాధ్యమని ప్రతి వ్యాపారవేత్త అనుకుంటారు. అయితే వీరికి వ్యాపారానికి సంబంధించిన సొమ్ము దొరకడం ఇబ్బందిగా మారుతుంది. అందువల్ల ఇలాంటి సమయంలో వారు బ్యాంకు లోన్ల కోసం చూస్తూ ఉంటారు. అయితే బ్యాంకుల నుంచి రుణం పొందడం చాలా ఎక్కువ ప్రాసెస్ కావడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకు బ్యాంకు రుణాలు మంజూరు కావు. అయితే చిన్న వ్యాపారులకు ఆర్థిక దన్ను ఇవ్వడానికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఎంఎస్‌ఎంఈ రుణాలను అందిస్తున్నాయి. దీని ద్వారా వ్యాపారవేత్తలు తరచుగా అవాంతరాలు లేని వ్యాపార కార్యకలాపాల కోసం రుణాలను పొందవచ్చు. ఈ రుణాలు సూక్ష్మ, చిన్న, మధ్యస్థ వ్యాపారులకు మేలు చేస్తాయి. అయితే ఈ ఎంఎస్‌ఎంఈ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎంఎస్‌ఎంఈ రుణం వారి రోజువారీ కార్యకలాపాల కోసం వ్యాపారాలకు మూలధనాన్ని అందిస్తుంది. ఈ రుణాలను దేశంలోని వివిధ బ్యాంకుల ద్వారా పొందవచ్చు. అయితే వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. ఎంఎస్‌ఎంఈ లోన్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది. అసలైన వర్తించే రేటు రుణదాత నిర్ణయిస్తారు. రుణం తీసుకోవడానికి కనీస పరిమితి లేదు కానీ గరిష్ట పరిమితి రూ. 2 కోట్లుగా నిర్ణయించారు. అయితే రుణదాత ఎంపిక ప్రకారం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఎగువ పరిమితిని సవరించవచ్చు. అలాగే ఇది అసురక్షిత వ్యాపార రుణం అయితే, రుణానికి తాకట్టు అవసరం లేదు. ఎంఎస్‌ఎంఈ లోన్ పదవీకాలం 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే రుణదాత పేర్కొన్న విధంగా మీరు ప్రాసెసింగ్ ఛార్జీలను చెల్లించాల్సి రావచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి