Vande Bharat Express Update: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి భారతీయ రైల్వే నుండి మరో కొత్త సమాచారం వెలువడుతోంది. ఈ నెలలో మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వే యోచిస్తోంది. దీని మార్గాన్ని కూడా రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ తేదీ కూడా నిర్ణయించబడింది. రైల్వే మంత్రిత్వ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. రూట్ ట్రయల్ తర్వాత CRS క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆపై రైలు నిర్ణీత మార్గంలో నడపబడుతుంది. రైల్వే శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఈ రైలు ట్రయల్ సెప్టెంబర్ 7,8 తేదీలలో జరుగుతుంది. దీని ట్రయల్ ముంబై అహ్మదాబాద్ మధ్య జరుగుతుంది. రూట్ ట్రయల్‌లో ఈ రైలు ప్రయాణికుల కెపాసిటీకి తగ్గట్టుగానే లోడ్‌ను ఉంచి నడపనున్నారు రైల్వే అధికారులు.
రైల్వే శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ట్రయల్ సందర్భంగా కొన్ని సీట్లలో ఉద్యోగులు కూర్చోవాలని, మిగిలిన సీట్లపై లోడ్ ఉంచి మిగిలిన వాటిని ట్రాక్‌లో ఉంచుతారని తెలుస్తోంది. రెగ్యులర్ గా నడిచే రైలు అదే వేగంతో నడుస్తుంది. ఇది పండుగ సీజన్‌లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఈ మార్గం ట్రయల్ తర్వాత కూడా దాని టైమ్ టేబుల్ తయారు చేయనున్నారు అధికారులు. పండుగ సీజన్‌లో దీన్ని ప్రారంభించాలని రైల్వే ప్లాన్ వేస్తోంది. దీని కారణంగా ప్రయాణికులు చాలా సులభంగా ప్రయాణించేందుకు వీలుంటుంది. అయితే ఈ రైలు 75 రూట్లలో నడపనున్నారు. దేశంలో కేవలం రెండు రూట్‌లు మాత్రమే న్యూఢిల్లీ నుండి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, న్యూఢిల్లీ నుండి వారణాసి మార్గంలో నడుస్తున్నాయి. త్వరలో ఇది లక్నో-ప్రయాగ్‌రాజ్-కాన్పూర్ మార్గంలో నడపనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 కొత్త మార్గాల్లో వందేభారత్‌ను నడపాలని యోచిస్తోంది రైల్వే శాఖ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి