Car Loan: కొత్త కారు కొనుగోలు చేస్తున్నారా..? అదిరిపోయే ఆఫర్‌.. చౌక వడ్డీతో బ్యాంకు రుణాలు..!

|

Jan 15, 2022 | 2:10 PM

Car Loan:  ప్రస్తుతం వ్యక్తిగత రుణాలు, కారు కొనుగోలుపై రుణాలు, గృహ నిర్మాణం కోసం రుణాలు సులభంగా అందిస్తున్నాయి బ్యాంకులు...

Car Loan: కొత్త కారు కొనుగోలు చేస్తున్నారా..? అదిరిపోయే ఆఫర్‌.. చౌక వడ్డీతో బ్యాంకు రుణాలు..!
Follow us on

Car Loan:  ప్రస్తుతం వ్యక్తిగత రుణాలు, కారు కొనుగోలుపై రుణాలు, గృహ నిర్మాణం కోసం రుణాలు సులభంగా అందిస్తున్నాయి బ్యాంకులు. కొన్ని బ్యాంకులు పండగ సీజన్‌లో వినియోగదారులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి. అయితే కారు కొనుగోలు చేయాలని భావించేవారికి ఇది మంచి అవకాశం. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వరకు అన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి.

ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కారుపై రుణాలను అందిస్తోంది. వార్షిక ఆదాయం కనీసం రూ.3 లక్షలు ఉన్నవారు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.

అలాగే ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కూడా కారు కోసం రుణం పొందవచ్చు. వడ్డీ రేటు 7.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే సీబీల్‌ స్కోర్‌ కూడా ఉండటం మంచిది. లేకపోతే రుణం పై ప్రభావం చూసే అవకాశం ఉంది. అలాగే స్కోర్‌ తక్కువ ఉన్నా.. రుణం లభిస్తుంది. కానీ వడ్డీ రేటు అధికంగా వసూలు చేస్తాయి పలు బ్యాంకులు.

ఇక బ్యాంక్‌ ఆఫ్ బరోడా కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. కారు ధరలో 90 శాతం వరకు ఫైనాన్స్‌ సదుపాయం కల్పిస్తోంది. వడ్డీ రేటు 7 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా కారు పై రుణం అందిస్తోంది. వడ్డీ శాతం 7.95 శాతం వసూలు చేస్తుంది. ఈ బ్యాంకు నుంచి రుణం పొందినట్లయితే 84 నెలలలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి:

Paytm Shut Down: ఇక నుంచి పేటీఎం యాప్‌ సేవలు నిలిపివేత.. ఎక్కడో తెలుసా..?

Credit Card Lock: క్రెడిట్, డెబిట్ కార్డుల‌కు లాక్‌ ఎలా చేయాలి.. కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!