Kotak Mahindra Bank: సాధారణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed deposits) చేసేవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇక ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల (Interest Rates)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌డీ వడ్డీ రేట్ల పెంపు డొమెస్టిక్, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ కస్టమర్లకు వర్తించనున్నట్లు కోటక్ మహీంద్రా తెలిపింది. ఈ వడ్డీ రేట్లు మార్చి 9 నుంచి అమల్లోకి వచ్చాయి.
కొత్త వడ్డీ రేట్లు ఇలా..
రూ.2 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఖాతాలపై ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెంచింది. గతంలో 4.9 శాతం ఉండేది. ఇక సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల వరకు అదనపు వడ్డీ రేట్లు లభించనున్నాయి.
గత నెలలో హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్ బ్యాంక్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు సహా ఇతర బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాలపరిమితిపై వడ్డీ రేట్లను పెంచాయి. తాజాగా యాక్సిస్ బ్యాంకు కూడా రెండోసారి వడ్డీ రేట్లను పెంచింది. కొత్త రేట్లు మార్చి 5 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇవి కూడా చదవండి: