Fixed Deposit
భారతదేశంలో పెట్టుబడిదారులు నమ్మకమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటూ ఉంటారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఎఫ్‌డీల కంటే మంచి పెట్టుబడి ఎంపికలు ప్రజాదరణ పొందుతున్నాయి. క్రమేపి బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో డిపాజిట్ చేసే వారి సంఖ్య క్రమేపి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడానికి చాలా బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లను లాంచ్ చేస్తున్నాయి. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే ఈ ప్రత్యేక ఎఫ్‌డీలు అధిక వడ్డీను అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకులు అన్నీ ప్రత్యేక ఎఫ్‌డీల కాలపరిమితిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితిని పెంచాయో? ఓ సారి తెలుసుకుందాం.
పొడగింపులను ప్రకటించిన బ్యాంకులు ఇవే
- ఇండియన్ బ్యాంక్ తన ప్రత్యేక ఎఫ్‌డీల కోసం పొడిగింపును ప్రకటించింది. ఎఫ్‌డీ పెట్టుబడిదారులు సెప్టెంబర్ 30 వరకు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ గడవు జూన్ 30తో ముగిసినా మరోసారి పెంచారు.
- ఐడీబీఐ బ్యాంక్‌కు సంబంధించిన ప్రత్యేక ఉత్సవ్ ఎఫ్‌డీల గడువు కూడా సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించారు. వాస్తవానికి ఈ పథకం గడువు జూన్ 30, 2024న ముగిసినా వినియోగదారులను ఆకర్షించడానికి బ్యాంకు మరోసారి గడువును పొడగించింది.
- పంజాబ్ & సింధ్ బ్యాంక్ లిమిటెడ్ పిరియడ్ ప్రత్యేక డిపాజిట్ల కాలపరిమితిని పెంచింది. ఈ గడువు సెప్టెంబర్ 30, 2024కి ముగుస్తుంది.
- ప్రముఖ బ్యాంకు ఎస్‌బీఐ కూడా ప్రత్యేక డిపాజిట్లపై కాలపరిమితిని పెంచింది. అమృత్ కలాష్ స్కీమ్, ఎస్‌బీఐ వీ కేర్ ఎఫ్‌డీల కాలపరిమితిని ఎస్‌బీఐ పెంచింది. ఎస్‌బీఐ కూడా ప్రత్యేక ఎఫ్‌డీలపై కాలపరిమితిని సెప్టెంబరు 30, 2024 వరకు పెంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..