EPS: ఈపీఎస్ పెన్షనర్లు లైఫ్‌సర్టిఫికెట్‌ను ఎప్పుడు సమర్పించాలి..? నియమాలు ఏమిటి?
ఈపీఎఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఈపీఎస్ సభ్యులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా సమర్పించవచ్చు. ఉదాహరణకు ఫిబ్రవరి 2023లో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ ఫిబ్రవరి 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈపీఎస్ సభ్యుడిగా ఉండి, మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలనుకుంటే మీరు జీవిత ధృవీకరణ పత్రాన్ని ఐపీపీబీ, ఇండియన్..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లను కలిగి ఉంది. వారు సంవత్సరానికి ఒకసారి తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. 15,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎస్ (ఉద్యోగుల పెన్షన్ పథకం) ప్రయోజనం లభిస్తుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ప్రారంభించబడింది.
ఈపీఎస్ పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించాలి?
ఈపీఎఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఈపీఎస్ సభ్యులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా సమర్పించవచ్చు. ఉదాహరణకు ఫిబ్రవరి 2023లో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ ఫిబ్రవరి 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈపీఎస్ సభ్యుడిగా ఉండి, మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలనుకుంటే మీరు జీవిత ధృవీకరణ పత్రాన్ని ఐపీపీబీ, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, పోస్ట్‌మ్యాన్, ఉమాంగ్ యాప్, కామన్ సర్వీస్ సెంటర్ లేదా సమీప పోస్టాఫీసులో సమర్పించవచ్చు.
ఈపీఎస్ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి ఈ పత్రాలు అవసరం.
- పీపీవో నంబర్
- ఆధార్ సంఖ్య
- బ్యాంకు ఖాతా వివరాలు
- మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడింది
మీరు ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించవచ్చు
ఆధార్, బయోమెట్రిక్స్ ద్వారా ఒక ప్రత్యేక ఐడీని సృష్టించడం ద్వారా మీరు మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని డిజిటల్‌గా సమర్పించవచ్చు. ముందుగా ఆధార్ సహాయంతో యూనిక్ ఐడీని క్రియేట్ చేసుకోండి. దీని తర్వాత మీరు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. దీని కోసం మీరు https://jeevanpramaan.gov.in అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లి మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.
అయితే మీరు ఈ పెన్షన్ సర్టిఫికేట్‌ను అందించకపోతే మీ పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. లేకపోతే మీరు ఇబ్బందులు పడవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లకుండా కూడా మీరు ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా కూడా పెన్షనర్లు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించవచ్చు. అయితే చాలా మంది ఈ లైఫ్ సర్టిఫికేట్‌లో కొంత గందరగోళం పడుతుంటారు. అందుకు నిబంధనలను ముందుస్తుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా పెన్షన్ తీసుకునే వారు లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించడం చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. లేకపోతే మీ పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి