Elon Musk: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ను విక్రయించిన ఎలన్‌ మస్క్‌.. ఇంతకీ ఎవరికో తెలుసా?

|

Mar 29, 2025 | 12:44 PM

ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'ను విక్రయించినట్లు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ శుక్రవారం (మార్చి 28) ప్రకటించాడు. ప్రపంచ కుభేరుడు మస్క్‌ ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా పనిచేస్తున్నారు. 2022లో ఆయన ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. అదే ఏడాది ట్విట్టర్‌ పిట్ట స్ధానంలో 'ఎక్స్' తీసుకొచ్చారు..

Elon Musk: ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ను విక్రయించిన ఎలన్‌ మస్క్‌.. ఇంతకీ ఎవరికో తెలుసా?
Elon Musk
Follow us on

టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ను విక్రయించినట్లు ప్రకటించాడు. ఎక్స్‌ని తన సొంత xAI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి 33 బిలియన్‌ డాలర్లకు విక్రయించినట్లు వెల్లడించాడు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో మస్క్‌ ప్రకటించాడు. మొత్తం స్టాక్ ఒప్పందంలో విక్రయించినట్లు మస్క్‌ పేర్కొన్నాడు. ఈ ఒప్పందంతో xAI విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారని తెలిపారు. రెండు కంపెనీలు ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్నాయి. అంటే ఈ కంపెనీలు తమ ఆర్థిక విషయాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం లేదన్నమాట.

టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO అయిన మస్క్‌ ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా పనిచేస్తున్నారు. 2022లో ఆయన్ ట్విట్టర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి, దాని సిబ్బందిని తొలగించి, ద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం, వినియోగదారు ధృవీకరణపై దాని విధానాలను మార్చడం వంటి విషయాల్లో.. అప్పట్లో నానారకాలుగా వార్తల్లో నిలిచారు. అదే ఏడాది ట్విట్టర్ పిట్ట స్థానంలోకి ‘X‌’ను చేర్చారు. ఎక్స్‌ని కొనుగోలు చేసిన ఏడాది తర్వాత చాట్‌జీపీటీకి పోటీగా xAI ని గత ఏడాది ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

xAI, X భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని అన్నారు. ఈ రోజు అధికారికంగా డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాల కోసం అడుగు వేస్తున్నామన్నారు. xAI అధునాతన AI సామర్థ్యం X పని తీరును మరింత బలోపేతం చేస్తుందని మస్క్ తన X పోస్టులో పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.