Bounce Electric Scooter: ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగిపోతోంది. కస్టమర్లను ఆసరాగా చేసుకుంటున్న వాహన తయారీ సంస్థలు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ బౌన్స్ ఇన్ఫినిటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇక బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్లు రెడ్, బ్లాక్, వైట్, గ్రే కలర్స్‌లో లభిస్తున్నాయి.
అద్భుతమైన ఫీచర్స్..
ఈ స్కూటర్స్‌లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు స్మార్ట్‌ఫోన్ ఆప్షన్ష్ కూడా ఇందులో ఉన్నాయి. రివర్సింగ్ మోడ్ కూడా ఉంది. బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌ను ఈకో మోడ్‌తో చార్జ్ చేసిన తర్వాత 85 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. స్వాపింగ్ ఫీచర్ ద్వారా కన్వెన్షల్ సాకెట్ ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. భారత్‌లో ఆయా ప్రధాన నగరాల్లో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఫుల్ ఛార్జింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. దేశంలో 3500 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను బౌన్స్ ఏర్పాటు చేయనుంది కంపెనీ. ఈ స్కూటర్‌కు కంపెనీ మూడు సంవత్సరాల వారంటీ అందిస్తోంది.
స్కూటర్ల ధరలు..
బౌన్స్ ఇన్ఫినిటీఈ1 ధర బ్యాటరీ ప్లస్ చార్జ్‌తో కలిపి రూ.79,999 (ఎక్స్‌షోరూమ్) . ఇక బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ ద్వారా ఈ స్కూటర్ తీసుకుంటే దీని ధర రూ.45,099 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది కంపెనీ. కొన్ని రాష్ట్రాల్లో బ్యాటరీ ప్లస్ చార్జ్‌తో కలిపి రూ.59,999 వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. రూ.499తో టోకెన్ తీసుకుని బుకింగ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: