Best vehicle: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ కార్లే బెస్ట్.. పెట్రోల్, డీజిల్‌తో చాలా కష్టం.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ లాంటి సిటీల్లో ప్రయాణాలకు ఎలక్ట్రిక్ కార్లు మంచి ఆప్షనా? సంప్రదాయ ఇంధన కార్లు ప్రయోజనకరమా? ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తరచూ వినిపిస్తున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఎలక్ట్రిక్ కార్లే బెస్ట్. ఎందుకు? ఏమిటి? ఎలా? తెలియాలంటే ఇది పూర్తిగా చదవండి.

హైదరాబాద్ వంటి సిటీల్లో కారులో ప్రయాణం అంటే కాస్త ఓపిక, సహనం, డ్రైవింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో కారులో ప్రయాణం అంటే అన్ని రకాలుగా కష్టమే. ఎందుకంటే ఈ సమయంలో కారులో ప్రయాణం అంటే సమయం వృథాతో పాటు ఇంధనం కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. సాధారణ ఇంధన ఇంజిన్లతో కూడిన కార్లు హైవేలు, ఓపెన్ రోడ్లలో మంచి మైలేజీతో పాటు అధిక పనితీరుని అందిస్తాయి. కానీ అదే ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే సిటీ పరిధిలోనే అది అధిక పనితీరుని కనబరుస్తుంది. పెట్రోల్ లేదా డీజిల్ కి పూర్తి వ్యతిరేకంగా ఎలక్ట్రిక్ కార్ల పనితీరు ఉంది. అదెలా సాధ్యం? తెలుసుకుందాం రండి..
ఇంధన కార్లతో కష్టమే..
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో దాని ప్రయోజనాలు, ఇబ్బందుల గురించిన ప్రశ్నలు అధికంగా వినిపిస్తున్నాయి. వాటిల్లో సిటీ పరిధిలో ఏది బెస్ట్? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. ఎందుకంటే సంప్రదాయ ఇంధన కార్లలో గేర్లు ఉంటాయి. గేర్లు, బ్రేకులు ఎంత ఎక్కువగా వినియోగిస్తే కారు అంత తక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. మైలేజీ పడిపోతోంది. హైదరాబాద్ వంటి సిటీ పరిధిలో ప్రయాణమంటే ఎక్కువ గా గేర్లు మార్చుతూ ఉండాలి. బ్రేకులు వినియోగించాలి. తద్వారా మొత్తం కారు పనితీరు పడిపోతోంది. మైలేజీ కూడా రాదు. అదే హైదరాబాద్ ఔటర్ రింగ్ పై ప్రయాణం చేయాలంటే సంప్రదాయ ఇంధన కార్లు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ గేర్లు, బ్రేకుల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మైలేజీ కూడా అధికంగా వస్తాయి.
సిటీలో ఎలక్ట్రిక్ కారు ఎందుకు బెస్ట్..
అదే సిటీ పరిధిలో ప్రయాణానికి ఎలక్ట్రిక్ కారు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. అంటే కారు బ్రేక్ వేసినప్పుడల్లా బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. అందువల్ల సిటీలో ట్రాఫిక్, సిగ్నల్ లైట్ల కారణంగా బ్రేకులు ఎక్కువగా వేస్తుంటారు. దీంతో బ్యాటరీ ఆటోమేటిక్ గా రీచార్జ్ అయిపోతుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ కార్లలో గేర్ బాక్స్ ఉండదు కాబట్టి.. డ్రైవింగ్ కూడా సౌకర్యవంతంగా, సులభంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







