AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మనీ మ్యూల్ అంటే ఏమిటి? పొరపాటున ఇలా అస్సలు చేయకండి.. లేకుంటే సమస్యల్లో ఇరుక్కున్నట్లే..!

Easy Money Scam Alert: అనుకోకుండా మీరు ఇలాంటి మోసంలో చిక్కుకున్నారని అనిపించినా, లేదా మీ ఖాతాలో గుర్తుతెలియని డబ్బు జమ అయినా తక్షణమే మీ బ్యాంకును సంప్రదించి సమాచారం అందించండి. అలాగే, ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి..

RBI: మనీ మ్యూల్ అంటే ఏమిటి? పొరపాటున ఇలా అస్సలు చేయకండి.. లేకుంటే సమస్యల్లో ఇరుక్కున్నట్లే..!
Easy Money Scam Alert
Subhash Goud
|

Updated on: Aug 08, 2026 | 1:40 PM

Share

RBI: ఆధునిక డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు సామాన్యుల అమాయకత్వాన్ని, త్వరితగతిన డబ్బు సంపాదించాలనే ఆశను ఆసరాగా చేసుకుని కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైనది “మనీ మ్యూల్” (Money Mule) మోసం. దీనివల్ల బాధితులు ప్రమేయం లేకుండానే ఆర్థిక నేరాల్లో భాగస్వాములుగా మారి తీవ్ర చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటున్నారు. దీనిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వినియోగదారులను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పిస్తోంది. ఈ మనీ మ్యాల్‌ విషంలో జాగ్రత్తగా ఉండాలంటూ వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపుతోంది.

మనీ మ్యూల్ అంటే ఏమిటి?

సైబర్ నేరగాళ్లు, అక్రమార్కులు చట్టవిరుద్ధంగా (ఆన్‌లైన్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా) సంపాదించిన డబ్బును నేరుగా తమ ఖాతాల్లోకి జమ చేసుకోరు. పోలీసుల నుంచి, దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి సాధారణ ప్రజల బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తారు. ఇతరుల తరఫున అక్రమంగా వచ్చిన డబ్బును తమ బ్యాంక్ ఖాతా ద్వారా మరొక ఖాతాకు బదిలీ చేసే లేదా విత్‌డ్రా చేసి ఇచ్చే వ్యక్తిని “మనీ మ్యూల్” అంటారు.

సైబర్ నేరగాళ్లు వేసే వలలు:

సైబర్ నేరగాళ్లు మనీ మ్యూల్స్‌ను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ఆఫర్లతో ఎర వేస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైమ్ ఉద్యోగాలకు వల వేస్తుంటారు. ఎలాంటి కష్టం లేకుండా రోజుకు కొన్ని నిమిషాలు కేటాయిస్తే వేలల్లో సంపాదించవచ్చని మెసేజ్‌లు పంపుతారు. మా ఖాతాలో ఏదో సాంకేతిక సమస్య ఉంది, మీ ఖాతాకు రూ. 50,000 పంపుతాం. అందులో రూ. 5,000 మీరు కమిషన్‌గా ఉంచుకుని మిగతా రూ. 45,000 మాకు వేరే అకౌంట్‌కి బదిలీ చేయండి అని ఆశ చూపుతారు. మీ అకౌంట్‌ను లేదా డెబిట్ కార్డ్‌ను నెలకు కొంత మొత్తం అద్దెకు ఇస్తే చాలని నమ్మిస్తారు. ఇలాంటి సమయంలో మీరు అత్యాశపడి బ్యాంక్ ఖాతాలు, ATM కార్డ్‌లు అద్దెకు ఇవ్వకండి.

ఇవి కూడా చదవండి

ఖాతాను వేరొకరికి ఇస్తే జరిగే నష్టాలు, చట్టపరమైన చిక్కులు:

చాలామంది మనకు తెలిసిన వారు కదా అని లేదా మనకు కమిషన్ వస్తుంది కదా అని లైట్ తీసుకుంటారు. కానీ ఇది తీవ్రమైన చట్టవిరుద్ధమైన చర్య.

  1. జైలు శిక్ష, జరిమానాలు: మీ ఖాతా ద్వారా అక్రమ డబ్బు చేతులు మారితే, సైబర్ నేరాలు, మనీ లాండరింగ్ కేసుల్లో మిమ్మల్ని ప్రధాన ముద్దాయిగా లేదా సహ నిందితుడిగా పరిగణిస్తారు. దీనివల్ల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సైబర్ పోలీసులు మీ బ్యాంక్ ఖాతాను తక్షణమే నిలిపివేస్తారు. దానివల్ల మీ సొంత డబ్బును కూడా వినియోగించుకోలేరు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం బ్లాక్‌లిస్ట్‌లో పడితే, భవిష్యత్తులో ఏ బ్యాంకులోనూ కొత్త ఖాతా తెరవడానికి కానీ, రుణాలు (Loans) పొందడానికి కానీ వీలుండదు.
  2. ప్రమాదం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీ బ్యాంక్ ఖాతా, మీ బాధ్యత: మీ ఖాతాను కేవలం మీ సొంత లావాదేవీలకు మాత్రమే ఉపయోగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బును బదిలీ చేయడానికి అనుమతించవద్దు.
  3. రహస్య వివరాలు పంచవద్దు: మీ బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ (PIN), ఓటీపీలు (OTP), యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దు.
  4. సులభంగా వచ్చే డబ్బును నమ్మవద్దు: ఎలాంటి కష్టం లేకుండా ఎక్కువ డబ్బు ఇస్తామనే ఆఫర్లను ఏమాత్రం నమ్మవద్దు.

సందేహం వస్తే ఏం చేయాలి?

అనుకోకుండా మీరు ఇలాంటి మోసంలో చిక్కుకున్నారని అనిపించినా, లేదా మీ ఖాతాలో గుర్తుతెలియని డబ్బు జమ అయినా తక్షణమే మీ బ్యాంకును సంప్రదించి సమాచారం అందించండి. అలాగే, ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

ఇది కూడా చదవండి: Bajaj Pulsar: ఆగస్టు 12న నెక్స్ట్ జనరేషన్ బజాజ్ పల్సర్ గ్రాండ్ ఎంట్రీ.. కొత్త ఫీచర్లతో అదిరిపోయే లుక్!

ఇది కూడా చదవండి: FASTag Pass: ఫాస్ట్ ట్యాగ్‌.. కేవలం రూ.340 చెల్లిస్తే చాలు నెల మొత్తం ఎన్ని సార్లు అయినా తిరగొచ్చు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల