
ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (ఉమాంగ్) యాప్ పౌరులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వినియోగదారులు స్కాలర్‌షిప్ స్కీమ్‌ల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. అలాగే విస్తృత అవసరాల కోసం యాప్‌ని ఉపయోగించుకోవచ్చు. వీటిలో పెన్షన్లు, పాస్‌పోర్ట్‌లు, ఎల్‌పీజీ గ్యాస్, నివాస ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన సేవలు పొందవచ్చు. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే వినియోగదారులు తమ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల నుంచి డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. వినియోగదారులు ఎలాంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా తమ పీఎఫ్ ఖాతాల నుండి డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉమంగ్ యాప్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. వివిధ డిజిటల్ సేవలను యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు ఏకీకృత ప్లాట్‌ఫారమ్‌ను అందించడానికి రూపొందించారు. 200 కంటే ఎక్కువ విభాగాల నుంచి 1,200 కి పైగా సేవలను అందిస్తున్న ఉమంగ్ ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందడాన్ని సులభతరం చేస్తుంది. వినియోగదారులు పీఎఫ్ బ్యాలెన్స్‌లను తనిఖీ చేయడం, నిధుల బదిలీ, ఉపసంహరణలు చేయడం వంటి అనేక రకాల ఈపీఎఫ్ఓ సేవలను యాప్‌లోనే పొందవచ్చు.
పీఎఫ్‌కు సంబంధించిన యూఏఎన్ కచ్చితంగా ఆధార్ నంబర్‌కు లింక్ అయ్యి ఉండాలి. అలాగే కేవైసీ వివరాలు (ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా) ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో అప్‌డేట్ చేసి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయినా, నిరుద్యోగులైనా, రిటైర్ అవుతున్నా, మెడికల్ ఎమర్జెన్సీని అనుభవిస్తున్నా, విద్యను అభ్యసించాలనుకున్నా లేదా ఇల్లు కొనాలనుకున్నా పీఎఫ్ ఖాతా నుంచి సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి