Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra Thar: త్వరలోనే మార్కెట్‌లోకి థార్‌ ఈ వెర్షన్‌.. అదరగొడుతున్న నయా ఫీచర్లు

తాజాగా ప్రముఖ కంపెనీ మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ తన మోస్ట్‌ ట్రస్టెడ్‌ కారు అయిన థార్‌లో ఈవీ వెర్షన్‌ను రిలీజ్‌ చేసింది. ఇటీవల నిర్వహించిన ఫ్యూచర్‌ స్కేప్‌ ఈవెంట్‌లో థార్‌-ఈ అనే కొత్త కాన్సెప్ట్‌ను రిలీజ్‌ చేసింది. బోర్న్‌ ఎలక్ట్రిక్‌ శ్రేణిలో భాగంగా మహీంద్రా థార్‌-ఈ ఓ ఈవీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఐసీఈ థార్‌ ఎలక్ట్రిక్‌ కన్వెర్షన్‌ కాదని మహీంద్రా ప్రతినిధులు పేర్కొన్నారు. థార్‌-ఈ వెర్షన్‌ కారు మహీంద్రాకు సంబంధించిన ఇంగ్లో పీ1 ఫ్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది.

Mahindra Thar: త్వరలోనే మార్కెట్‌లోకి థార్‌ ఈ వెర్షన్‌.. అదరగొడుతున్న నయా ఫీచర్లు
Mahindra Thar E
Follow us
Srinu

|

Updated on: Aug 19, 2023 | 7:00 PM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ ట్రెండ్‌ నడుస్తుంది. ముఖ్యంగా ఈవీ టూ వీలర్స్‌ను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే తాజా అప్‌డేట్స్‌లో భాగంగా ఎక్కువ మైలేజ్‌ ఇచ్చేలా ఫోర్‌ వీలర్‌ ఈవీలు కూడా మార్కెట్‌ను పలుకరిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ తన మోస్ట్‌ ట్రస్టెడ్‌ కారు అయిన థార్‌లో ఈవీ వెర్షన్‌ను రిలీజ్‌ చేసింది. ఇటీవల నిర్వహించిన ఫ్యూచర్‌ స్కేప్‌ ఈవెంట్‌లో థార్‌-ఈ అనే కొత్త కాన్సెప్ట్‌ను రిలీజ్‌ చేసింది. బోర్న్‌ ఎలక్ట్రిక్‌ శ్రేణిలో భాగంగా మహీంద్రా థార్‌-ఈ ఓ ఈవీగా అభివృద్ధి చేస్తున్నామని, ఇది ఐసీఈ థార్‌ ఎలక్ట్రిక్‌ కన్వెర్షన్‌ కాదని మహీంద్రా ప్రతినిధులు పేర్కొన్నారు. థార్‌-ఈ వెర్షన్‌ కారు మహీంద్రాకు సంబంధించిన ఇంగ్లో పీ1 ఫ్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ తాజాగా ప్లాట్‌ఫారమ్‌ అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో పాటు ఉత్తమ ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఈ థార్‌-ఈ వెర్షన​ ఐదు డోర్లతో వస్తుందని తెలుస్తుంది. అదనపు డోర్లు, బ్యాటరీ ప్యాక్‌కు అనుగుణంగా థార్‌-ఈ ఈవీ వీల్‌బేస్‌ 2775 ఎంఎం నుంచి 2975 ఎంఎం వరకూ ఉంటుందని తెలుస్తుంది. ఈ మహీంద్రా థార్‌-ఈ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

థార్‌-ఈ డిజైన్‌

మహీంద్రా థార్‌-ఈ ప్రస్తుతం థార్‌ ఐసీఈ వెర్షన్‌తో పోలిస్తే మెరుగైన డిజైన్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ కార్‌ స్క్వేర్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కార్‌ స్టీల్‌ ఫ్రంట్‌ బంపర్‌ ఈవీకి కఠినమైన రూపాన్ని ఇస్తుంది. అదనపు డోర్‌ల కారణంగా థార్‌-ఈ వెర్షన్‌ పొడుగ్గా కనిపిస్తుంది. స్క్వేర్డ్‌ అవుట్‌ వీల్‌ ఆర్చ్‌లతో కూడిన పెద్ద అలాయ్‌ వీల్స్‌ థార్‌-ఈ ప్రత్యేకత. కరెంట్‌ జెన్‌ మోడల్‌లానే థార్‌-ఈ కూడా టెయిల్‌ గేట్‌పై స్పేర్‌ వీల్‌, స్క్వేర్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌లతో వస్తుంది.

థార్‌-ఈ ‍క్యాబిన్‌

మహీంద్రా థార్-ఈ వివిధ డ్రైవ్ మోడ్‌లకు తలుపులు తెరిచినప్పటి నుండి 75  రకాల సౌండ్‌లను కలిగి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. వీటిని ప్రముఖ మ్యూజిక్‌ డైరెర్టర్‌ ఏఆర్‌ రెహమాన్ అభివృద్ధి చేశారని పేర్కొంటున్నారు. మహీంద్రా థార్‌-ఈ లోపల వాటర్ గొట్టం ఉంటుంది. ఇది ఆఫ్-రోడింగ్ తర్వాత క్యాబిన్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. ఈ కారు లోపలి భాగంలో మినిమలిస్టిక్ డాష్‌బోర్డ్ డిజైన్ ఉంటుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కొత్త స్టీరింగ్ వీల్ ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

పవర్‌ట్రెయిన్‌

మహీంద్రా ఎక్స్‌యూవీ 400తో పోలిస్తే ఎలక్ట్రిక్ థార్ ఆఫ్-రోడ్ లక్షణాలకు అనుగుణంగా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది 4 డబ్ల్యూడీ సిస్టమ్‌తో కూడిన రెండు మోటార్‌లతో వస్తుందని భావిస్తున్నారు. తక్షణమే ఉత్పత్తి అయ్యేలా టార్క్ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కూడా పెంచుతుంది.

రిలీజ్‌ ఎప్పుడంటే?

మహీంద్రా థార్-ఈ లాంచ్ టైమ్‌లైన్‌ను కంపెనీ వెల్లడించలేదు, అయితే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ మార్చి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. థార్ 2024 తర్వాత లేదా 2025 ప్రారంభంలో లాంచ్ అవుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..