Portable AC: తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.!

ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి తాపాన్ని తట్టుకోవాలంటే.. ఫ్యాన్ గాలి సరిపోదు.. కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే..

Portable AC: తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు.. ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.!
Portable Ac

Updated on: Mar 10, 2023 | 1:42 PM

ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి తాపాన్ని తట్టుకోవాలంటే.. ఫ్యాన్ గాలి సరిపోదు.. కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. సొంత ఇల్లు ఉన్నవారయితే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏసీని బిగించేసుకుంటారు. అదే అద్దె ఇంట్లో ఉంటున్నవారికైతే.. ఏసీని అమర్చుకోవాలంటే ఇబ్బందులు పడాలి. కానీ ఇప్పుడు ఆ సమస్య ఉండదు. ఎందుకంటే మార్కెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీ గదిలో ఏ చోటైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా ఈజీగా చక్రాల సాయంతో తీసుకెళ్లొచ్చు. వాస్తవానికి గోడకు అమర్చే ఏసీ.. కేవలం ఒక్క గదిని మాత్రమే చల్లబరుస్తుంది. అదే పోర్టబుల్ ఏసీతో.. మొత్తం ఇంటిని కూల్ చేయవచ్చు. అంతేకాకుండా దీన్ని ఇంటి అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మామూలు ఏసీతో పోల్చితే ఈ పోర్టబుల్ ఏసీల ధర చాలా తక్కువగా ఉంటుంది.

మధ్యతరగతి వారికి అవసరమయ్యే తక్కువ బడ్జెట్‌లో లభించే ఈ పోర్టబుల్ ఏసీల నుంచి సౌండ్‌ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ నిద్రకు కూడా ఆటంకం ఉండదు. ఇక పోర్టబుల్ AC సామర్థ్యాన్ని పరిశీలిస్తే  0.5 నుంచి 1.5 టన్ను వరకు ఉంటుంది. మరి లేట్ ఎందుకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పోర్టబుల్ ఏసీలపై ఓ లుక్కేద్దాం పదండి..

బ్రాండ్ నేమ్ ధర
నార్డిక్ హైగ్ ఎయిర్‌చిల్ పర్సనల్ ఎయిర్ కండీషనర్ రూ. 14295
సిరోబేర్(CEROBEAR) రీచార్జ్‌బుల్ పోర్టబుల్ ఎయిర్ రూ. 10795
జెనరిక్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ రూ. 10758
ఎయిర్ ఛాయిస్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ఫ్యాన్ రూ. 9639
వెరోస్కై(VeRosky) పోర్టబుల్ ఎయిర్ కండీషనర్స్ రూ. 8981
పాంగ్ పాంగ్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ రూ. 8331
బోన్వా(Bonwa) పర్సనల్ ఎయిర్ కండీషనర్స్ పోర్టబుల్ AC మినీ రూ. 8000
బ్లూస్టార్ 1 టన్ పోర్టబుల్ AC రూ. 33,490

కాగా, ప్రస్తుతం అన్ని కంపెనీలు పోర్టబుల్‌ ఏసీలను అందుబాటులో ఉంచాయి. ఈ పోర్టబుల్‌ ఏసీలను మంచం దగ్గర పెట్టుకోవచ్చు. కుర్చీ పెట్టే స్థలంతో గది మొత్తాన్ని చల్లబరుస్తుంది. పోర్టబుల్ ఏసీ అద్దెకు నివసించే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మీరు ఇంటిని మారాల్సి వస్తే.. దీన్ని ఈజీగా ప్యాక్ కూడా చేయవచ్చు.(Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..