Passport Apply: పాస్‌పోర్ట్ పొందడానికి ఏ పత్రాలు అవసరం.. ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

|

Aug 09, 2022 | 6:20 AM

New Passport Apply: విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు ఎవరైనా తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి . పాస్‌పోర్ట్ చట్టం, 1967 ప్రకారం.. భారత ప్రభుత్వం వివిధ..

Passport Apply: పాస్‌పోర్ట్ పొందడానికి ఏ పత్రాలు అవసరం.. ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
Follow us on

New Passport Apply: విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు ఎవరైనా తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి . పాస్‌పోర్ట్ చట్టం, 1967 ప్రకారం.. భారత ప్రభుత్వం వివిధ రకాల పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంది. ఇందులో సాధారణ పాస్‌పోర్ట్, దౌత్య పాస్‌పోర్ట్, అధికారిక పాస్‌పోర్ట్ యు చెల్లుబాటు అయ్యే పత్రాల కింద ఎమర్జెన్సీ సర్టిఫికేట్, గుర్తింపు సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తులో అభ్యర్థించిన పత్రాలు ఇవ్వకపోతే లేదా దానిలో ఏదైనా లోపం ఉన్నట్లయితేన తిరస్కరించబడుతుంది. అందువల్ల పాస్‌పోర్ట్‌ పొందడానికి ఏ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించుకోండి. పాస్‌పోర్ట్ పొందడానికి, మీరు దరఖాస్తుతో పాటు కింద పేర్కొన్న పత్రాలను సమర్పించాలి.

పుట్టిన తేదీ సర్టిఫికేట్, ఫోటోతో కూడిన గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అధికారి చిరునామా రుజువు, ఇతర రుజువులతో దానిని ధృవీకరిస్తారు. తర్వాత జాతీయత సర్టిఫికేట్ .. దీనిని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అధికారి సపోర్టింగ్ డాక్యుమెంట్ నుండి వెరిఫై చేస్తారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK)ని సందర్శించడానికి మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. దీని కోసం ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి చేయబడింది.

ఎక్కడ దరఖాస్తు చేయాలి

ఇవి కూడా చదవండి

పాస్‌పోర్ట్ పొందడానికి మీరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, పోస్టాఫీసు సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రెండు కార్యాలయాలు పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని చూసుకుంటాయి. ఈ రెండు కేంద్రాల్లోనూ పాస్‌పోర్టుల తయారీకి టోకెన్లు తీసుకోవచ్చు. కొత్త పాస్‌పోర్ట్ జారీ చేయడానికి లేదా పాస్‌పోర్ట్ మళ్లీ జారీ చేయడానికి టోకెన్, రసీదు ఇవ్వబడుతుంది. దీని ఆధారంగా మీరు పాస్‌పోర్ట్ పొందుతారు. ఈ రెండు కార్యాలయాలు ఫ్రంట్ ఎండ్ ఆఫీస్‌గా పనిచేస్తుండగా, బ్యాంక్ ఎండ్‌కు సంబంధించిన పనిని పాస్‌పోర్ట్ కార్యాలయం నిర్వహిస్తుంది. పాస్‌పోర్ట్ కార్యాలయం స్వయంగా పాస్‌పోర్ట్ ప్రింటింగ్, లామినేషన్, పాస్‌పోర్ట్ డిస్పాచ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులు, పోలీసులతో అనుసంధానం చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి