CIBIL Score: ఉచితంగా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు.. అదెలా అంటే..

చాలా మందికి అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలీదు. దానిని ఎలా తనిఖీ చేసుకోవాలో కూడా అవగాహన ఉండదు. అలాంటి వారి కోసం ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫారం గూగుల్ పే ప్రత్యేకమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఉచితంగా సిబిల్ స్కోర్ తనిఖీ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. అందుకోసం ట్రాన్స్ యూనియన్ సిబిల్ తో అనుసంధానమైంది. దీంతో వ్యక్తులు సులభంగా, ఉచితంగా తమ క్రెడిట్ రిపోర్టును పొందవచ్చు.

CIBIL Score: ఉచితంగా సిబిల్ స్కోర్ తెలుసుకోవచ్చు.. అదెలా అంటే..
Credit Score

Edited By:

Updated on: Nov 14, 2023 | 10:11 PM

ప్రస్తుత సమకాలీన ప్రపంచంలో ఫైనాన్స్ రంగం బాగా పుంజుకుంది. ఏదో ఒకరమైన లోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ఇల్లు కట్టాలన్నా, బండి కొనాలన్నా.. ఇంట్లో వస్తువులు కావాలన్నా అన్నింటికీ ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటన్నంటికీ ప్రధానంగా కావాల్సింది వ్యక్తుల సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ రిపోర్టు. దీని ఆధారంగా వ్యక్తులకు రుణాలు మంజూరవుతుంటాయి. అయితే చాలా మందికి అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలీదు. దానిని ఎలా తనిఖీ చేసుకోవాలో కూడా అవగాహన ఉండదు. అలాంటి వారి కోసం ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫారం గూగుల్ పే ప్రత్యేకమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఉచితంగా సిబిల్ స్కోర్ తనిఖీ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. అందుకోసం ట్రాన్స్ యూనియన్ సిబిల్ తో అనుసంధానమైంది. దీంతో వ్యక్తులు సులభంగా, ఉచితంగా తమ క్రెడిట్ రిపోర్టును పొందవచ్చు.

అసలు సిబిల్ అంటే..

గూగుల్ పేలో సిబిల్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో చూసే ముందు అసలు ఈ సిబిల్ అనే మూడు అంకెలు గల సంఖ్య అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్) అనేది వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, అందులోని నిల్వలు, పాత రుణాలు, వాటి చెల్లింపులు, రాబడులు, ఖర్చులను ప్రతిబింబించే ఒక రిపోర్టు. భవిష్యత్తు రుణాలకు ఇదే ఆధారం అవుతుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా రుణాలు మంజూరు అవుతాయి. వడ్డీ రేట్లు కూడా తక్కువకే వస్తాయి. సిబిల్ 600 కంటే తక్కువ ఉన్న ఏదైనా రెడ్ ఫ్లాగ్‌గా పరిగణిస్తారు. ఇది అధిక క్రెడిట్ రిస్క్ ను సూచిస్తుంది. మీరు పెట్టుకునే రుణ అప్లికేషన్‌ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 600-649 మధ్య సిబిల్ ఉంటే అది పూర్ విభాగంలోకి వస్తుంది, 650-699 “ఫెయిర్”గా పరిగణించబడుతుంది, 700-749 “మంచిది”గా పరిగణించబడుతుంది. 750 కంటే ఎక్కువ ఉంటే అది “ఎక్స్ లెంట్” రేటింగ్. మీ క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా అవసరం. ఎందుకంటే ఇది రుణ ఆమోదాలు, క్రెడిట్ కార్డ్ జారీని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఉపాధి అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది.

గూగుల్ పే ద్వారా సిబిల్ స్కోర్..

గూగుల్ పే వినూత్నస్కోర్ ట్రాకింగ్ ఫీచర్‌తో, వినియోగదారులు వారి క్రెడిట్ స్కోర్‌కు సులభంగా యాక్సెస్ చేయడమే కాకుండా, దాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది.
కొత్త వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి గూగుల్ పే యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. మీ బ్యాంకు ఖాతా లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్‌ను నమోదు చేసి, మీ గూగుల్ ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
తర్వాత గూగుల్ పే యాప్ తెరిచి ” మేనేజ్ యువర్ మనీ” విభాగంలోకి వెళ్లండి.
అందులో ” చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ” అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
మీ స్క్రీన్‌పై ఒక ప్రశ్న పాప్ అప్ అవుతుంది, “మంచి సిబిల్ స్కోర్ మీకు లోన్‌లపై మెరుగైన వడ్డీ రేట్లను అందజేస్తుంది. మీరు మంచి స్కోర్ సాధించాలని అని ఆలోచిస్తున్నారా?” మూడు ప్రతిస్పందన ఎంపికలతో – ఎస్, నాట్ షూర్, నో. మీకు నచ్చిన ఎంపికను ఎంచుకుని, దిగువన ఉన్న “లెట్స్ చెక్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
మీ పాన్ కార్డ్‌లో కనిపించే విధంగా మీ మొదటి పేరు, చివరి పేరును నమోదు చేయండి. “కంటిన్యూ” ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఈ సరళమైన దశలను పూర్తి చేసిన తర్వాత, మీ సిబిల్ స్కోర్‌ను తక్షణమే వీక్షించడానికి మీ క్రెడిట్ నివేదిక రూపొందించబడుతుంది. అంతేకాకుండా, మీరు మీ క్రెడిట్ యోగ్యతను పెంచుకోవడానికి వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..