e-Pan Card: మీ పాన్ కార్డ్ పోయిందా.? ఆన్‌లైన్‌లో ఇ- పాన్‌ను ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి.
ఒకవేళ పాన్ కార్డ్ పోతే, 10 నిమిషాల్లో ఇ-కార్డ్‌ను పొందొచ్చు. ఇందుకోసం రూపాయి ఖర్చు కూడా చేయాల్సి అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో సులభంగా పాన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ పోయినా, పాడై పోయిన వారి కోసం ఆదాయపు శాఖ ఇ-పాన్‌ను పొందే అవకాశం కల్పించింది. సాధారణంగా ఆఫ్‌లైన్ విధానంలో పాన్ కార్డ్‌ను పొందాలంటే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రక్రియ అంతా ముగిసి...
ఆర్థికపరమైన ప్రతీ చిన్న అవసరానికి పాన్‌కార్డ్ తప్పనిసరిగా మారింది. బ్యాంకులో డబ్బుల విత్‌డ్రా నుంచి ఆస్తుల కొనుగోలు వరకు అన్నింటికీ పాన్ కార్డ్ ఉండాల్సిందే. ఇక పాన్ కార్డును గుర్తింపు కార్డుగా కూడా పరిగణిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ని ఆర్థికరమైన అవసరాలకు పాన్ కార్డ్‌ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఒకవేళ పాన్ కార్డు పోతే ఏం చేయాలి.? అప్పటికప్పుడు పాన్ కార్డ్‌తో ఏదైనా అవసరం వస్తే ఎలా.? ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకవేళ పాన్ కార్డ్ పోతే, 10 నిమిషాల్లో ఇ-కార్డ్‌ను పొందొచ్చు. ఇందుకోసం రూపాయి ఖర్చు కూడా చేయాల్సి అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో సులభంగా పాన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ పోయినా, పాడై పోయిన వారి కోసం ఆదాయపు శాఖ ఇ-పాన్‌ను పొందే అవకాశం కల్పించింది. సాధారణంగా ఆఫ్‌లైన్ విధానంలో పాన్ కార్డ్‌ను పొందాలంటే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రక్రియ అంతా ముగిసి పాన్ కార్డ్ చేతికి వచ్చే సరికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. అప్పటి వరకు ఇ-పాన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ ఇ-పాన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయ్యుండాలి. ఒక్క ఆధార్ కార్డ్ ఉంటే చాలు ఈజీగా ఇ-పాన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-పాన్ కార్డ్ డిజిటల్ సంతకంతో కూడి ఉంటుంది. ఆన్‌లైన్ డౌన్‌లోడ్ చేసుకున్న పాన్ కార్డ్‌ను రెగ్యులర్ పాన్ కార్డ్‌లాగే ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ పాన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
* ఇందుకోసం ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో కనిపించే ఇన్‌స్టాంగ్ ఇ-పాన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత ఇ-పాన్ పేజీలో గెట్ న్యూ ఇ-పాన్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి.
* అనంతరం ఓపెన్ అయిన ఇ-పాన్ పేజీలో ఆధార్ నెంబర్‌ను మోదు చేసి కాన్ఫామ్‌పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు వెంటనే మీ ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వెళ్తుంది.
* యూఐడీఏఐతో ఆధార్ వివరాలను ధృవీకరించడానికి చెక్‌బాక్స్‌ని సెలక్ట్ చేసుకొని, కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత ఆధార్ వివరాల పేజీలో అగ్రీ అనే చెక్‌బాక్స్‌ను సెలక్ట్ చేసుకొని, కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు సక్సెస్ అనే మెసేజ్ వస్తుంది. అందులో ఐడీ ఉంటుంది.
ఇక చివరిగా మీ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌తో ఈ ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత డ్యాష్ బోర్డ్‌లో ఇ-పాన్ వ్యూ/డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ 12 నెంబర్‌ల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్‌ను ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..