Aadhaar card: దేశంలో ఆధార్‌ కార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా.?

|

Aug 08, 2023 | 11:29 AM

కేవైసీ వెరిఫికేషన్‌ కోసం చాలా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆధార్‌ కార్డును ఉపయోగిస్తున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆధార్‌ సేవలకు సంబంధించిన బాధ్యతలను చూసుకుంటోంది. ప్రజల సౌకర్యార్థం ఆన్‌లైన్‌తో పాటు ఆధార్‌ సెంటర్స్‌ ద్వారా సేవలు అందిస్తున్నాయి. మరి మన జీవితంలో భాగమైన ఆధార్‌ కార్డు గురించి మీకు ఎంత వరకు తెలుసు.? అసలు భారత దేశంలో ఆధార్‌ కార్డును ఎప్పుడు ప్రవేశ పెట్టారు, దేశంలో మొట్ట మొదటి ఆధార్‌ కార్డును ఎవరికి ఇచ్చారు.? ఆధార్‌ కార్డు ఏ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టారు.? లాంటి ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి..

Aadhaar card: దేశంలో ఆధార్‌ కార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా.?
Aadhar Card
Follow us on

ఆధార్‌ కార్డు భారతీయులకు దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత దేశంలో ప్రతీ పౌరుడికి ఒక ప్రత్యేక నెంబర్‌ను అందిస్తూ ఈ ఆధార్‌ కార్డును రూపొందించారు. సిమ్‌ కార్డు మొదలు గ్యాస్‌ కనెక్షన్‌ వరకు, ఫ్లైట్‌ టికెట్ కొనుగోలు మొదలు ఇంటి కొనుగోలు వరకు ప్రతీ ఒక్కదానికి ఆధార్‌ కార్డు తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం కూడా ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది. అంతేకాకుండా పాన్‌ కార్డు, రేషన్‌ కార్డులను సైతం ఆధార్‌తో లింక్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆధార్‌ కార్డు లేనిదే రోజు గడవని పరస్థితి నెలకొంది. ఆధార్‌ కార్డు లేకుండా ప్రభుత్వంతో ముడిపడిన ఏ ఒక్క పని జరగని పరిస్థితి నెలకొంది.

కేవైసీ వెరిఫికేషన్‌ కోసం చాలా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆధార్‌ కార్డును ఉపయోగిస్తున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఆధార్‌ సేవలకు సంబంధించిన బాధ్యతలను చూసుకుంటోంది. ప్రజల సౌకర్యార్థం ఆన్‌లైన్‌తో పాటు ఆధార్‌ సెంటర్స్‌ ద్వారా సేవలు అందిస్తున్నాయి. మరి మన జీవితంలో భాగమైన ఆధార్‌ కార్డు గురించి మీకు ఎంత వరకు తెలుసు.? అసలు భారత దేశంలో ఆధార్‌ కార్డును ఎప్పుడు ప్రవేశ పెట్టారు, దేశంలో మొట్ట మొదటి ఆధార్‌ కార్డును ఎవరికి ఇచ్చారు.? ఆధార్‌ కార్డు ఏ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టారు.? లాంటి ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి..

ప్రతీ పనికి కచ్చితంగా అవసరయ్యే ఆధార్‌ కార్డును తొలిసారి దేశంలో 2010లో తీసుకొచ్చారు. మహారాష్ట్రలోని టెంభాలి అనే గ్రామానికి చెందిన రంజనా సోనావానే అనే మహిళ తొలి ఆధార్‌ కార్డు తీసుకున్న వ్యక్తిగా నిలిచింది. ఈమెకు 2010 సెప్టెంబర్‌ 29న అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సమక్షంలో అందించారు. ఇలా దేశంలో మొదట ఆధార్‌ తీసుకున్న వ్యక్తిగా రంజనా సోనావానే, ఆధార్‌ కార్డు పొందిన తొలి గ్రామంగా టెంబాలి నిలిచింది. అప్పట్లో ఈ గ్రామం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌గా మారింది. ఆ సమయంలో పలువురు నేతలు గ్రామానికి వచ్చి, రంజనను కలుసుకున్నారు. దీంతో ఈ గ్రామం గురించి దేశమంతా చర్చించుకుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో 90 శాతం మందికి పైగా ఆధార్ కార్డులు ఉన్నాయి. 2022 నవంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 135.2 కోట్ల ఆధార్‌ నెంబర్స్‌ జనరేట్ అయ్యాయి. ఆధార్‌ కార్డు అందుబాటులోకి వచ్చే ముందు ఎక్కువగా ఓటర్‌ కార్డును వ్యక్తి గుర్తింపు కార్డుగా ఉపయోగించే వారు. మొదట్లో ఆధార్‌ కార్డు ఉపయోగం పెద్దగా లేకపోయినప్పటికీ క్రమంగా అన్ని రంగాలకు ఆధార్‌ కార్డును విస్తరించారు. ప్రస్తుతం ప్రతీ అవసరానికి ఆధార్‌ అనివార్యంగా మారింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..