FD Interest Rates: ఆ మూడు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీ వడ్డీ రేట్ల సవరణ.. ఎంత పెంచుయో తెలుసా?

| Edited By: TV9 Telugu

Oct 09, 2023 | 6:35 PM

2023లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పుడు అనేక బ్యాంకులు సాధారణ ఖాతాదారులకు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటు యథాతథంగా ఉంచడంతో బ్యాంకులు కూడా ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచడం లేదు . అయితే కొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

FD Interest Rates: ఆ మూడు ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీ వడ్డీ రేట్ల సవరణ.. ఎంత పెంచుయో తెలుసా?
Cash
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్లు తక్కువ-రిస్క్, స్థిరమైన పెట్టుబడి సాధనాన్ని కోరుకునే పెట్టుబడిదారుల కోసం ఒక ప్రముఖ పెట్టుబడి ఎంపికగా ఉంటాయి. నిర్ణీత కాలవ్యవధిలో ఎఫ్‌డీలు పెట్టుబడులపై స్థిర వడ్డీ రేటును అందిస్తాయి. ఐదు సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉన్న కొన్ని ఎఫ్‌డీ పన్ను ఆదా లక్షణాలతో వస్తాయి. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు బ్యాంకులు క్రమ పద్ధతిలో అప్‌డేట్ చేస్తాయి. పునరుద్ధరణలు, కొత్త డిపాజిట్లు సవరించిన వడ్డీ రేట్లకు లోబడి ఉంటాయి. అయితే ఇప్పటికే ఉన్న డిపాజిట్లు ఒప్పంద రేటులో వడ్డీని పొందడం కొనసాగిస్తుంది. 2023లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పుడు అనేక బ్యాంకులు సాధారణ ఖాతాదారులకు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటు యథాతథంగా ఉంచడంతో బ్యాంకులు కూడా ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచడం లేదు . అయితే కొన్ని బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా మూడు ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఆ బ్యాంకులు ఏంటి? ఎంత మేర వడ్డీ రేట్లను పెంచుతున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించారు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ వడ్డీ రేట్లు సెప్టెంబర్ 18 నుండి అమలులోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7.10 శాతం వరకు, సీనియర్ సిటిజన్‌లకు 3 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.

ఐడీబీఐ బ్యాంక్

ఐడీబీఐ బ్యాంక్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా సవరించారు. బ్యాంక్ అధికారిక పోర్టల్ ప్రకారం ఈ రేట్లు సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్ సాధారణ వినియోగదారులకు ఏడు రోజుల నుంచి ఐదు సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.8 శాతం వరకు వడ్డీ రేట్లను అందజేస్తుంది. ఏడు రోజుల నుంచి ఐదు సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై శాతం నుంచి 7.3 శాతం వరకూ వడ్డీ రేటను అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

కోటక్ మహీంద్రా బ్యాంక్

కోటక్ మహీంద్రా బ్యాంక్ సెప్టెంబర్‌లో ఎఫ్‌డీపై వడ్డీ రేటును పెంచింది. ఇటీవలి మార్పును అనుసరించి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పుడు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 2.75 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లు పొందుతారు. ఈ తాజా వడ్డీ రేట్లు సెప్టెంబర్ 13 నుండి అమలులోకి వచ్చాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..