Personal Loans: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా? క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందా? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి..

|

Dec 15, 2022 | 12:15 PM

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి ఏదైనా లోన్ తీసుకోవాలంటే క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ఎంతో ముఖ్యం. సిబిల్‌ స్కోర్ బాగుంటే సులభంగా లోన్ తీసుకోవడం వీలవుతుంది. గతంలో మనం తీసుకున్న లోన్స్ సకాలంలో చెల్లించడం..

Personal Loans: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా? క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందా? టెన్షన్ వద్దు.. ఇలా చేయండి..
Personal Loan
Follow us on

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి ఏదైనా లోన్ తీసుకోవాలంటే క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ఎంతో ముఖ్యం. సిబిల్‌ స్కోర్ బాగుంటే సులభంగా లోన్ తీసుకోవడం వీలవుతుంది. గతంలో మనం తీసుకున్న లోన్స్ సకాలంలో చెల్లించడం అలాగే నెలవారీ మన ఆర్ధిక నిర్వహణపై సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి ఫైనాన్షియల్ స్టెబిలిటీని అంచనా వేయడానికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు క్రెడిట్ స్కోర్ దోహదపడుతుంది. సాధారణంగా క్రెడిట్ స్కోర్ కనిష్టంగా 300 నుంచి గరిష్టంగా 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉండే ఆ వ్యక్తి సిబిల్ బాగున్నట్లు అంచనా వేస్తారు. క్రెడిట్ స్కోర్ 550 నుంచి 750 మధ్య ఉంటే దానిని కూడా మంచి సిబిల్ గానే పరిగణిస్తారు. 550 కంటే తక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే.. బ్యాడ్ సిబిల్ అంటారు. క్రెడిట్ స్కోర్ తక్కువుగా ఉంటే పర్సనల్‌ లోన్ దొరకదనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. చాలా మంది ఇదే విషయాన్ని చెబుతారు. కాని ఇది పూర్తిగా అవాస్తవం. క్రెడిట్‌ స్కోర్ తక్కువుగా ఉన్నప్పటికి పర్సనల్ లోన్ పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

నెలవారీ వాయిదాలు చెల్లించగల సామర్థ్యం

క్రెడిట్‌ స్కోర్‌తో పాటు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని బ్యాంకులు లేదా లోన్ శాంక్షన్ చేసే సంస్థలు అంచనా వేస్తాయి. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకున్నపుడు క్రెడిట్ స్కోర్ ఆశాజనకంగా లేనప్పటికి.. మీరు నెలవారీ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించగలిగే సామర్థ్యం ఉందని నిరూపించుకోవల్సి ఉంటుంది. మీ ఉద్యోగం టెంపరరీ కాదని, రెగ్యులర్ ఉద్యోగమని, ఉద్యోగ భద్రత ఉందని బ్యాంకు ప్రతినిధులను కన్వెన్స్ చేయగలిగితే లోన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

హామీదారు ఉంటే రుణం పొందడం సులభం

మీ క్రెడిట్ స్కోర్ బాగోలేనట్లయితే సిబిల్ స్కోర్ బాగున్న మరో వ్యక్తి హామీతో మీరు లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఆ వ్యక్తి మీరు తీసుకునే రుణానికి హామీదారుడిగా ఉన్నట్లు సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలా వేరే వ్యక్తి హామీ ఉన్నప్పుడు.. హామీదారుడి క్రెడిట్ స్కోర్‌ను రుణం ఇచ్చే సంస్థ పరిశీలిస్తుంది. ఓ వ్యక్తి గ్యారంటీ ఉండటం వలన లోన్ రీపేమెంట్‌లలో డిఫాల్ట్ చేయరని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విశ్వసించే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తనఖా పెట్టడం ద్వారా

బ్యాడ్ క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్నప్పటికి.. ఆస్తిని తనఖా పెట్టి వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు. ఇది హామీగా పనిచేస్తుంది. దీనిలో హామీదారుడికి బదులుగా మీరు తప్పనిసరిగా బ్యాంకు వద్ద ఏదైనా ఆస్తిని (ప్రొపర్టీ) తనఖా పెట్టాల్సి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించకపోతే, తనఖా పెట్టిన ఆస్తిని విక్రయించే హక్కు బ్యాంకుకు ఉంటుంది.

చిన్న మొత్తంలో రుణం

క్రెడిట్ స్కోర్ బాగోలేని వ్యక్తులు ఎక్కువ మొత్తంలో రుణం పొందడం కష్టతరమవుతుంది. అయితే తక్కువ మొత్తంలో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేస్తే.. తప్పకుండా లోన్ పొందే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ రిపొర్టులో లోపాలు..

కొన్ని సందర్భాల్లో సమయానికి తీసుకున్న లోన్ క్రమంగా చెల్లించినప్పటికి.. క్రెడిట్ స్కోర్ తక్కువుగా చూపించవచ్చు. ఇది లోన్ పొందే అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. కనీసం సంవత్సరానికి ఒకసారి మీ క్రెడిట్ రిపోర్ట్ ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవడం మంచిది. క్రెడిట్ రిపోర్టులో ఏదైనా పొరపాటు స్పష్టంగా కనిపిస్తే వెంటనే సవరించుకునే ప్రయత్నం చేయాలి.  క్రెడిట్ స్కోర్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..