Diwali Bonus: ఇంకో వారం రోజుల్లో దీపావళి పండుగ వచ్చేస్తుంది. ఇప్పటికే పలు సంస్థలు తమ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను ఇచ్చేశాయి. ఇక మరికొన్ని కంపెనీలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. సంస్థ స్థాయి, ఉద్యోగి జీతం ఆధారంగా రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు బోనస్ రూపంలో అందుకుంటుంటారు. సాధారణంగా పండగ బోనస్ వచ్చిందంటే చాలా మంది దుస్తులు, స్మార్ట్ ఫోన్స్, ఇంట్లోకి ఉపకరణాలను కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అయితే అలా కాకుండా ఈ డబ్బును సద్వినియోగం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ అమౌంట్ చూడడానికి చిన్నదిగానే అనిపించినా వీటిని తెలివిగా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్తులో రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంతకీ ఈ దీపావళికి వచ్చే బోనస్‌ను ఏయో రూపంలో దాచుకుంటే భవిష్యత్తులో వాటి తాలుకూ ఫలాలను పొందొచ్చో ఇప్పుడు చూద్దాం..
ఎస్‌బీఐలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల పాటు డబ్బును డిపాజిట్ చేస్తే.. 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు వడ్డీని చెల్లిస్తారు. అలాగే సీనియర్ సిటిజన్స్ వారు డిపాజిట్ చేసిన వాటిపై 50 బేసిస్ పాయింట్స్ అధనంగా పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు 2021 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రముఖ ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.50 శాతం నుంచి 5.50 శాతం వరకు (7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి) వడ్డీ అందిస్తోంది. ఇక సీనియర్ సిటీజన్స్ విషయానికొస్తే 3 శాతం నుంచి 6.25 శాతం వరకు అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ 2.5 శాతం నుంచి 5.50 శాతం వరకు (7 రోజు నుంచి 10 ఏళ్ల కాలానికి) వడ్డీని అందిస్తోంది.
ఈ టర్మ్ డిపాజిట్ కూడా బ్యాంకుల్లో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల మాదిరిగానే ఉంటాయి. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ 1 నుంచి 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఇందులో 1 నుంచి 3 ఏళ్ల కాలానికి 5.5 శాతం వడ్డీని అందిస్తే.. 5 ఏళ్ల కాలానికి 6.7 శాతం వడ్డీ అందిస్తారు.
డబ్బును పొదుపు చేయడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు మ్యూచువల్ ఫండ్స్, బంగారం కొనుగోలు వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సాధారణంగా పండుగ సీజన్‌లలో భారతీయులు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక బంగారాన్ని బౌతికంగా కొనుగోలు చేయకుండానే గోల్డ్‌పై పెట్టుబడి పెట్టేందుకు గాను సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకాన్ని నవంబర్ 2015వ తేదీన కేంద్రం ప్రారంభించింది. బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు ఉంటుంది. అంతలోపు నిష్క్రమించేందుకు రెండు పద్ధతులు ఉన్నాయి.
ఎక్స్చేంజీలో లిస్టయిన బాండ్స్‌ను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించాలి. లేదా జారీ చేసిన తేదీ నుండి ఐదో సంవత్సరం తర్వాత బాండ్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఈ విధానంలో వినియోగదారుడు ఒక గ్రామ్ నుంచి 4 కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. బాండ్‌లను కొనుగోలు చేసిన వారికి ఏడాదికి 2.50 శాతం వడ్డీని పొందొచ్చు.
Also Read: Dinesh Karthik: అభిమానులకు ‘డబుల్’ ధమాకా న్యూస్ చెప్పిన దినేష్ కార్తీక్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అందాలను చూస్తే మైమరచిపోతారు..
Yoga Poses: ఈ 3 యోగాసనాలు మీలోని రోగనిరోధక శక్తిని మరింత పెంచుతాయి.. పూర్తి వివరాలు మీకోసం..