రెండేళ్లకు మించి ఖాతా నిర్వహించని (ఇన్‌ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్), మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారులపై జరిమానా విధించవద్దని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల మొత్తాన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న అనేక చర్యలలో పై మినిమమ్ బ్యాలెన్స్ రుసుము నిర్ణయం ఒకటి. అలాగే, మరో ముఖ్యమైన ఆర్డర్‌లో స్కాలర్‌షిప్ నిధులు లేదా DBT నిధులను స్వీకరించడానికి సృష్టించబడిన బ్యాంక్ ఖాతాలను ఇన్‌యాక్టివ్ బ్యాంక్ ఖాతాలుగా బదిలీ చేయరాదని ఆర్బీఐ తెలిపింది. రెండేళ్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరగని ఖాతాలను బ్యాంకులు పనిచేయని ఖాతాలుగా వర్గీకరిస్తాయి. ఇప్పుడు ఆర్బీఐ ఈ చర్యను మార్చింది.
బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ సౌకర్యం ఉంది. జీతాల ఖాతాలకు కూడా ఈ ప్రత్యేక హక్కు ఉంది. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ వంటి బ్యాంకుల్లో కనీస నిల్వ మొత్తం రూ.10,000. కొన్ని బ్యాంకుల్లో రూ.1,000 నుంచి రూ.10,000 వరకు కనీస నిల్వ ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా చాలా సంవత్సరాలుగా పనిచేయని ఖాతాలకు అనేక వేల రూపాయల జరిమానా విధించవచ్చు. ఒకవేళ, కస్టమర్ తన పాత ఖాతాను పునరుద్ధరించాలనుకుంటే, పెనాల్టీ చెల్లించడానికి భయపడవచ్చు. దీన్ని నివారించడానికి మినిమమ్ బ్యాలెన్స్ ఫీజు వసూలు చేయవద్దని ఆర్‌బిఐ బ్యాంకులకు తెలిపింది.
గతంలో కూడా మినిమమ్ బ్యాలెన్స్ గురించి ఆర్బీఐ బ్యాంకులకు తెలియజేసింది. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసినందుకు పెనాల్టీ అకౌంట్ నెగటివ్‌గా మారుతుంది. ఇలాంటి జరిమానాలు విధించకుండా బ్యాంకులు జాగ్రత్త వహించాలని ఆర్‌బీఐ గతంలోనే చెప్పింది. అయితే ఇప్పటి కొన్ని బ్యాంకులు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ ఛార్జీలను విధించడం మానేశాయి. ఇప్పుడు రెండేళ్లుగా కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలను ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు విధించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేయడంతో వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించినట్లయ్యింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి