DMart: వారంలో ఏ రోజు డీమార్ట్‌కు వెళ్తే.. ఫ్రెష్ స్టాక్ దొరుకుతుందో తెలుసా?
డీమార్ట్ స్టోర్లకు ప్రతిరోజూ కొత్త స్టాక్ చేరుతుండగా, ఎక్కువగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య సరుకు డెలివరీ జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం నుంచి బుధవారం వరకు షెల్ఫ్‌లను కొత్త ఉత్పత్తులతో నింపుతారు. తాజా వస్తువులు కొనాలనుకునే వారు పూర్తి వివరాలు తెలుసుకోండి.

చాలా మంది తమ ఇంట్లోకి కావాల్సిన సరుకుల కోసం డీమార్ట్ స్టోర్లకు వెళ్తుంటారు. బయట సాధారణ కిరాణా స్టోర్లు, సూపర్ మార్కెట్లతో పోల్చుకుంటే అక్కడ ధరలు తక్కువగా ఉంటాయని, అన్నీ ఒకే చోట దొరుకుతాయనే భావనతో అక్కడ షాపింగ్ చేస్తారు. అయితే డీమార్ట్‌కి రెగ్యులర్‌గా వెళ్లేవారికి కూడా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. అదేంటంటే.. డీమార్ట్ స్టోర్‌కు అసలు కొత్త స్టాక్ ఎప్పుడు తెస్తారు? ఏ రోజు వెళ్తే మనం ఫ్రెష్ స్టాక్ కొనుగోలు చేయొచ్చు అనే విషయాలను చాలా మంది పట్టించుకోరు. అయితే ఈ రోజు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మన దేశంలో ప్రముఖ రిటైల్ చైన్‌గా గుర్తింపు పొందిన డీమార్ట్ స్టోర్లలో ప్రతిరోజూ కొత్త స్టాక్ అందుబాటులోకి వస్తుంటుంది. అయితే ఈ సరుకును కస్టమర్లు ఎక్కువగా వచ్చే సమయాల్లో కాకుండా, రాత్రి వేళల్లో లేదా తెల్లవారుజామున స్టోర్లకు తరలిస్తారు. దీంతో కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టోర్ నిర్వహణ సజావుగా సాగుతుంది.
రిటైల్ రంగానికి చెందిన సమాచారం ప్రకారం, డీమార్ట్ స్టోర్లకు సాధారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య కొత్త సరుకు చేరుతుంది. ఈ సమయంలో స్టోర్ సిబ్బంది వివిధ విభాగాలకు చెందిన ఉత్పత్తులను షెల్ఫ్‌లలో అమర్చే పనిని పూర్తి చేస్తారు. కస్టమర్లు స్టోర్‌కు వచ్చే సమయానికి ఎక్కువ భాగం ఉత్పత్తులు ఇప్పటికే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: DMart: రూ.1000 లతో డీమార్ట్‌కు వెళ్తే.. నెలకు సరిపడా సరుకులు! చాలా మందికి తెలియని సింపుల్ ట్రిక్స్
ముఖ్యంగా సోమవారం నుంచి బుధవారం వరకు షెల్ఫ్‌లలో కొత్త స్టాక్ నింపే ప్రక్రియ మరింత చురుకుగా జరుగుతుంది. వారాంతంలో జరిగిన భారీ అమ్మకాల తర్వాత ఖాళీ అయిన షెల్ఫ్‌లను ఈ రోజుల్లో తిరిగి నింపుతారు. దీంతో కిరాణా వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, వంటగది సామగ్రి వంటి విభాగాల్లో తాజా స్టాక్ అందుబాటులోకి వస్తుంది. దీన్ని బట్టి గురువారం రోజు డీమార్ట్‌కు వెళ్తే ఫ్రెష్ స్టాక్, ఎక్కువ వెరైటీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులతో పాటు డీమార్ట్ సొంత బ్రాండ్ వస్తువులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా షెల్ఫ్‌లలో అమర్చబడతాయి. కొన్ని సీజనల్ ఉత్పత్తులు, ప్రత్యేక ఆఫర్లకు సంబంధించిన వస్తువులు కూడా కొత్త స్టాక్‌లో భాగంగా స్టోర్లకు చేరుతుంటాయి. అందువల్ల కొత్తగా వచ్చిన వస్తువులను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు వారంలో ప్రారంభ రోజుల్లో స్టోర్‌ను సందర్శించడం ప్రయోజనకరంగా ఉంటుందని రిటైల్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: DMart: నెలలో ఏ రోజు డీమార్ట్‌కి వెళ్తే మంచిది..? చాలా మందికి తెలియని ట్రిక్
అయితే స్టాక్ డెలివరీ సమయం, షెల్ఫ్‌లను నింపే షెడ్యూల్ ప్రతి డీమార్ట్ స్టోర్‌లో స్థానిక అవసరాలు, విక్రయాల స్థాయిని బట్టి కొంత మారవచ్చు. అయినప్పటికీ ఎక్కువ శాతం స్టోర్లలో రాత్రి లేదా తెల్లవారుజామునే సరుకును దింపి, సోమవారం నుంచి బుధవారం మధ్య షెల్ఫ్‌లను పూర్తిస్థాయిలో నింపడం సాధారణ ప్రక్రియగా కొనసాగుతోంది. దీంతో వినియోగదారులు తాజా స్టాక్‌తో పాటు విస్తృత ఎంపికలను పొందే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
