Wedding Loan: పెళ్లికి కూడా లోన్ ఇస్తారని తెలుసా? ఆ లోన్ పొందడానికి అర్హతలు ఇవే..!

జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ వైభవానికి బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. తక్కువ వడ్డీతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

Wedding Loan: పెళ్లికి కూడా లోన్ ఇస్తారని తెలుసా? ఆ లోన్ పొందడానికి అర్హతలు ఇవే..!
Marraige

Updated on: Apr 11, 2023 | 4:00 PM

పెళ్లి అంటే ప్రతిఒక్కరి జీవితంలో ఓ సంబరం లాంటిది. ముఖ్యంగా మన బంధువులు, స్నేహితులు మధ్య అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరి కోరికగా ఉంటుంది. అయితే ప్రస్తుతం పెరిగన ధరల కారణంగా పెళ్లి ఫంక్షన్ నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. దీంతో పెళ్లి ఫంక్షన్లను తక్కువ ఖర్చుతో చేసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే పెళ్లి అంటే ముఖ్యంగా బంగారం కొంటారు. అలాగే పెళ్లి తర్వాత హనిమూన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇలా ఏ పనైనా ఖర్చు విషయంలో వెనకడుగు వేస్తారు. అయితే జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ వైభవానికి బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా లోన్లు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. తక్కువ వడ్డీతో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అప్పుల పాలు కాకుండా తక్కువ వడ్డీతోనే వీటిని అందిస్తున్నాయి. అయితే పెళ్లి రుణం పొందడానికి కావాల్సిన అర్హతలు, పత్రాలు ఏంటో ఓ సారి చూద్దాం.

అర్హత ప్రమాణాలు

పెళ్లి కోసం వ్యక్తిగత రుణం కోసం ప్రతి దరఖాస్తుదారుడి అర్హత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అర్హత అవసరాలు రుణదాత నుంచి రుణదాతకు భిన్నంగా ఉన్నప్పటికీ సాధారణంగా ఉండే ప్రమాణాల గురించి ఓ లుక్కేద్దాం.

కనీస వయస్సు

వివాహ రుణాల కోసం దరఖాస్తుదారులు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. కొంతమంది రుణదాతలు వివాహ రుణాల కోసం 23 ఏళ్ల కనీస వయోపరిమితిని ఉండాలని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

గరిష్ట వయస్సు 

వివాహ రుణాలపై ఆసక్తి ఉన్న వేతన రుణగ్రహీతల వయస్సు 58 కంటే ఎక్కువ ఉండకూడదు. స్వయం ఉపాధి రుణగ్రహీతల వయస్సు 65 కంటే ఎక్కువ ఉండకూడదు.

నెలవారీ నికర ఆదాయం కనిష్టం 

వివాహ రుణాలకు సాధారణంగా కనీస నెలవారీ ఆదాయం రూ. 15,000. అయితే నిర్దిష్ట రుణదాతలు కనీసం రూ. 25,000గా ఉండాలని పేర్కొంటున్నారు.

ఉపాధి

వృత్తి నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, జీతం పొందే వ్యక్తులు ఆదాయ అవసరాలను తీర్చినంత వరకు వివాహ రుణాలకు అర్హులుగా బ్యాంకులు పేర్కొంటున్నాయి.

ఉపాధి స్థితి

వివాహ రుణాలకు అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా నమ్మదగిన ఆదాయ వనరులను కలిగి ఉండాలి. వివాహ రుణాలకు అర్హత పొందాలంటే జీతం పొందే వ్యక్తులు వారి ప్రస్తుత ఉద్యోగం కోసం కనీసం ఒక సంవత్సరంతో పాటు కనీసం రెండు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.

క్రెడిట్ రేటింగ్

700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్‌లు ఉన్న దరఖాస్తుదారుల కోసం రుణాలను ఆమోదించడానికి రుణదాతలు ఇష్టపడతారు. వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ సిబిల్ స్కోర్‌లు ఉన్న దరఖాస్తుదారులకు వివాహ రుణం ఇప్పటికీ ఆమోదించే అవకాశం ఉంది. 

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం