Dell Laptops: డెల్‌ నుంచి కొత్తగా ల్యాప్‌టాప్‌ల విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌.. బడ్జెట్‌ ధరల్లోనే అందుబాటులో

Dell Laptops: ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ డెల్​తన ఇన్​స్పిరాన్​ల్యాప్‌టాప్‌లను రీడిజైన్‌ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇన్‌స్పిరాన్ 14 (2 ఇన్ 1), ఇన్​స్పిరాన్ 13, ఇన్​స్పిరాన్​ 14..

Dell Laptops: డెల్‌ నుంచి కొత్తగా ల్యాప్‌టాప్‌ల విడుదల.. అదిరిపోయే ఫీచర్స్‌.. బడ్జెట్‌ ధరల్లోనే అందుబాటులో
Dell Inspiron Laptops
Follow us
Subhash Goud

|

Updated on: Jun 20, 2021 | 11:17 AM

Dell Laptops: ప్రముఖ ఎలక్ట్రానిక్​ బ్రాండ్​ డెల్​తన ఇన్​స్పిరాన్​ల్యాప్‌టాప్‌లను రీడిజైన్‌ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇన్‌స్పిరాన్ 14 (2 ఇన్ 1), ఇన్​స్పిరాన్ 13, ఇన్​స్పిరాన్​ 14 ల్యాప్‌టాప్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్లను పొందుపర్చి బడ్జెట్​ ధరలోనే విడుదల చేసింది. వీటిలో ఇంటెల్, AMD కాన్ఫిగరేషన్‌ అందించింది. ఇవి ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో కూడిన 54Whr బ్యాటరీతో పనిచేస్తాయి. ఇప్పటికే మార్కెట్​లో విడుదలైన ఈ ల్యాప్​టాప్స్​ను డెల్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, రిటైల్ అవుట్‌లెట్స్​, డెల్ స్టోర్స్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 -ఇన్ 1) ఫీచర్స్‌

కొత్త డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 -ఇన్ 1) 14- అంగుళాల ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ టచ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం ల్యాప్‌టాప్‌గానే కాకుండా టాబ్లెట్​గానూ ఉపయోగించుకోవచ్చు. ఇది 11th జనరేషన్‌ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో ఎన్విడియా జిఫోర్స్ MX350 GPU గ్రాఫిక్​ కార్డు అందించింది. AMD వేరియంట్ విషయానికి వస్తే.. దీనిలో ఇన్​బిల్ట్​ రేడియన్ గ్రాఫిక్స్​తో కూడిన రైజెన్ 7 5700U CPU ప్రాసెసర్​ను చేర్చింది. అంతేకాకుండా ఇందులో 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజ్​ అందించింది. ఇందులో రెండు యుఎస్​బి 3.2 జెన్ 1 టైప్-ఎ పోర్ట్స్, యుఎస్బి 3.2 జెన్ 1 టైప్-సి పోర్ట్, ఒక హెచ్​డిఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్​ఫోన్ జాక్ వంటివి చేర్చింది. ఇంటెల్ కాన్ఫిగరేషన్​ గల డెల్ ఇన్​స్పిరాన్ 14 (2 -ఇన్ 1) మోడల్ ధర రూ. 57,990 నుండి ప్రారంభమవుతుంది. ఇక, AMD కాన్ఫిగరేషన్​ బేస్ వేరియంట్ ధర రూ .65,990 నుంచి ప్రారంభమవుతుంది.

డెల్ ఇన్​స్పిరాన్ 13

డెల్ ఇన్​స్పిరాన్ 13 అన్ని మోడల్స్​ కన్నా చిన్న సైజులో ఉంటుంది. దీనిలో 13.3 -అంగుళాల QHD + (2560×1600 పిక్సెల్స్) డిస్‌ప్లేని అందించింది. ఇది 11th జనరేషన్‌ ఇంటెల్ కోర్ i7-11370H సిపియు ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది ఎన్విడియా జిఫోర్స్ MX450 GPU గ్రాఫిక్​ కార్డ్​తో వస్తుంది. ఈ కొత్త డెల్ ల్యాప్‌టాప్ 16GB RAM, 512GB NVMe SSD స్టోరేజ్​తో వస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. యుఎస్‌బి టైప్-ఎ 3.2 జెన్ 1 పోర్ట్, రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, హెచ్‌డిఎంఐ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. ఇది రూ. 68,990 ధర వద్ద లభిస్తుంది.

డెల్ ఇన్​స్పిరోన్ 14

డెల్ ఇన్‌స్పిరాన్ 14 కొత్త మోడల్​ 14 -అంగుళాల పూర్తి-హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 11th జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్‌ను అందించింది. అంతేకాక, ఎన్విడియా జిఫోర్స్ MX450 GPU గ్రాఫిక్​ కార్డ్, 16GB ర్యామ్​, 1TB SSD స్టోరేజ్ వంటివి చేర్చింది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. థండర్ బోల్ట్ 4 పోర్ట్, యుఎస్బి టైప్-సి 3.2 జెన్ 2 పోర్ట్, రెండు యుఎస్​బి టైప్-ఎ 3.2 జెన్ 1 పోర్ట్స్, ఒక హెచ్​డిఎంఐ పోర్ట్, ఒక ఎస్డి కార్డ్ రీడర్, హెడ్​ఫోన్, మైక్రోఫోన్ కోసం కాంబో జాక్ వంటివి అందించింది. ఇది రూ .44,990 ధర వద్ద లభిస్తుంది.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్