AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loan: లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.? వాళ్లు ఇంటికి రాకుండా ఉండాలంటే..!

అప్పుల ఒత్తిడి, బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి న్యాయవాదులు, లీగల్ అడ్వైజర్స్ సలహా ఇస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి.

Bank Loan: లోన్ కట్టలేదని బ్యాంకులు టార్చర్ చేస్తున్నాయా.? వాళ్లు ఇంటికి రాకుండా ఉండాలంటే..!
Loan India
Ravi Kiran
|

Updated on: Feb 04, 2026 | 1:53 PM

Share

ఆర్థిక సమస్యలు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల కారణంగా ఎదురవుతున్న వేధింపులు అనేక మందిని ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకు రికవరీ ఏజెంట్ల ఒత్తిడి, రుణగ్రహీతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో రుణగ్రహీతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, సమస్యల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలేంటి అనేవి లీగల్ అడ్వైజర్స్, న్యాయవాదులు చెబుతున్నారు. దేశంలో ఆత్మహత్యలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనై, సరైన నిర్ణయాలు తీసుకోలేక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు.

రుణం తీసుకున్న ఏ వ్యక్తీ కావాలని ఎగ్గొట్టాలని అనుకోడని, అత్యవసర పరిస్థితుల్లోనే అప్పులు తీర్చలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. రుణ సమస్యల్లో ఉన్నవారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతు ఇవ్వకుండా, మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారని ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు అన్నారు. ఇది రుణగ్రహీతలను మరింత డిప్రెషన్‌లోకి నెట్టి, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడానికి కారణమవుతుందని ఆయన అన్నారు. చాలా మంది రుణగ్రహీతలు కావాలని అప్పులు ఎగ్గొట్టాలని అనుకోరని, కేవలం 1-2 శాతం మంది మాత్రమే అటువంటి ఉద్దేశ్యంతో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

మిగిలిన వారు తమ వద్ద ఉన్న బంగారం, ఆస్తులు అమ్మి అయినా అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారని, పూర్తిగా చేతులెత్తేసినప్పుడు మాత్రమే కట్టలేని పరిస్థితికి వస్తారని వివరించారు. అప్పులు ఇచ్చేవారు కూడా రుణగ్రహీతలకు నిజంగా కష్టపడుతున్నారా లేదా అప్పులు చేసి బతికే గుణం ఉందా అని గమనించాలని సూచించారు. ఈ నేపథ్యంలో, అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా సరైన లాయర్ లేదా లీగల్ అడ్వైజర్‌ను సంప్రదించాలన్నారు. అప్పులను “ఆర్గనైజ్” చేసి, వాటిని తీర్చడానికి గల అవకాశాలను వెతకాలన్నారు. అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు కోర్టు ద్వారా ఉపశమనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి