Central Government: సైబర్ మోసంలో డబ్బులు పోగొట్టుకున్నారా..? ఇంటి నుంచే రీఫండ్ పొందొచ్చు.. ఈ ఒక్క పని చేస్తే..
దేశంలో సైబర్ నేరగాలు పెరుగుతున్న క్రమంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అలాగే ఆన్‌లైన్ ద్వారా రీఫండ్ కోసం పొందే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. వీటి వివరాలు..

దేశంలో రోజురోజుకి సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఓటీపీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్టుల వంటి పద్దతుల్లో ప్రజలను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. వీరి వలలో చిక్కుకుని తమ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని కాజేసుకుంటున్నారు. తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మొత్తాన్ని సైబర్ నేరాలతో పొగోట్టుకుంటున్నారు. అయితే ఇలా డబ్బులు పొయినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలనేది చాలామందికి తెలియదు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతుంటారు. తిరిగి పొందేందుకు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక నుంచి మీరు ఎక్కడికి తిరగాల్సిన పనే లేదు. ఇంట్లోనే ఉండి సైబర్ మోసాలపై ఫిర్యాదు చేయడంలో పాటు మీ డబ్బును తిరిగి రాబట్టుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మొబైల్ రిస్టోరేషన్ మాడ్యూల్ లేదా ఎంఆర్‌ఎం పోర్టల్‌ను ప్రారంభించింది.
అసలు ఎంఆర్ఎం పోర్టల్ ఏంటి..?
ఈ పోర్టల్ ద్వారా బాధితులు తమ ఇళ్లలో నుంచే సౌకర్యవంతంగా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అకౌంట్లోని డబ్బులు మీకు తెలియకుండా డెబిట్ అయితే వెంటనే ఫిర్యాదు చేయాలి. దీంతో మోసగాడి ఖాతాలోని నిధులను స్తంభింపజేసి తిరిగి మీకు రీఫండ్ చేస్తారు. వెంటనే కంప్లైంట్ చేసేవారికి మాత్రమే ఈ రీఫండ్ వచ్చే అవకాశముంటుంది. ఇందుకోసం మొబైల్ రిస్టోరేషన్ మాడ్యూల్‌ను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభించింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో భాగంగా దీనిని తీసుకొచ్చింది. సైబర్ నేరాల్లో మోసపోయినవారు ఇంట్లో నుంచే ఫిర్యాదు చేసి డబ్బులు తిరిగి పొందేందుకు ఇది సహాయపడుతుంది. డబ్బులు పొగోట్టుకుంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే మోసగాడి బ్యాంక్ ఖాతా స్తంభింపజేయబడి ఉండాలి. ఈ రెండు జరిగితే బాధితుడు MRM పోర్టల్ ద్వారా రీఫండ్ పొందవచ్చు. స్తంభింపజేసిన మొత్తం రూ.50 వేల కంటే తక్కువగా ఉంటే ఎఫ్‌ఐఆర్ లేదా కోర్టు ఉత్తర్వు అవసరం ఉండదు. కేవలం పోలీసు ఫిర్యాదు ఆధారంగానే రీఫండ్ వస్తుంది. రూ.50 వేలు దాటితే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి కోర్టు ఉత్తర్వు పొందడం తప్పనిసరి అవుతుంది.
రీఫండ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?
-MRM పోర్టల్ ఓపెన్ చేయండి
– సిటిజన్ లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి
-Raise Refund Request ఆప్షన్ ఎంచుకోండి
– మీ 14 అంకెల ఫిర్యాదు IDని నమోదు చేయండి
-సిస్టమ్ మీ స్తంభింపజేసిన మొత్తాన్ని ప్రదర్శిస్తుంది
– పాన్ కార్డ్ డిజిటల్ కాపీని అప్‌లోడ్ చేయండి
– బ్యాంక్ అకౌంట్ వివరాలు అందించండి
– మీ వద్ద కోర్టు ఉత్తర్వు ఉంటే దాని కాపీని కూడా అప్‌లోడ్ చేయండి
-డిక్లరేషన్ ఫారమ్‌కు అంగీకరించిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
