AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ కడితే లాభమా.? నష్టమా.? ఇది చూడకపోతే మోసపోతారు..

నేటి సమాజంలో క్రెడిట్ కార్డు అనేది ఒక హోదాగా మారిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా లక్షల విలువైన వస్తువులను కొనే శక్తిని ఇది ఇస్తుంది. అయితే ఈ వెసులుబాటే మనల్ని విలాసాలకు బానిసలుగా చేస్తుంది. అవసరం లేని వస్తువులను కూడా కేవలం క్రెడిట్ కార్డు ఉంది కదా అని..

క్రెడిట్ కార్డు బిల్లులో మినిమమ్ డ్యూ కడితే లాభమా.? నష్టమా.? ఇది చూడకపోతే మోసపోతారు..
Credit Cards
Ravi Kiran
|

Updated on: May 13, 2026 | 10:53 AM

Share

నేటి కాలంలో క్రెడిట్ కార్డు లేని వారు చాలా తక్కువ. బ్యాంకులో అకౌంట్ ఉంటే చాలు, ఉచితంగా క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ మనకు రోజూ ఫోన్లు వస్తూనే ఉంటాయి. చేతిలో డబ్బులు లేకపోయినా ఏదైనా వస్తువును కొనే వెసులుబాటు ఉండటంతో, చాలామంది క్రెడిట్ కార్డులను వరంగా భావిస్తారు. కానీ, ఈ సౌకర్యమే ఒకానొక దశలో మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులో ఉండే “మినిమం డ్యూ” అనే అంశం ఒక పెద్ద మాయాజాలం.

చాలామంది క్రెడిట్ కార్డు బిల్లు రాగానే అందులో ఉన్న మొత్తం అమౌంట్ కట్టలేక, కేవలం మినిమం అమౌంట్ కట్టేసి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. “అమ్మయ్య! ఈ నెలకు గడిచిపోయింది కదా” అని రిలాక్స్ అవుతారు. కానీ అసలు ప్రమాదం ఇక్కడే మొదలవుతుంది. మీరు కట్టే ఆ మినిమం అమౌంట్ కేవలం వడ్డీకి మాత్రమే సరిపోతుంది. అసలు అలాగే ఉంటుంది. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ ఏడాదికి దాదాపు 30 శాతం నుండి 45 శాతం వరకు ఉంటుంది. ఇది సాధారణ పర్సనల్ లోన్స్ కంటే చాలా ఎక్కువ.

మనం చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, క్రెడిట్ కార్డును డెబిట్ కార్డులా వాడటం. అవసరం లేకపోయినా కేవలం ఆఫర్లు ఉన్నాయని లేదా స్టేటస్ కోసమని అనవసరమైన వస్తువులు కొనేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వచ్చే నెల వచ్చే జీతం కంటే క్రెడిట్ కార్డు బిల్లు ఎక్కువైపోతుంది. అప్పుడు కేవలం మినిమం డ్యూ కడుతూ కాలం వెళ్లదీస్తుంటే, ఆ అప్పు చక్రవడ్డీతో కొండలా పెరిగిపోతుంది. ఒకానొక దశలో అది మనం తీర్చలేనంత భారం అయిపోతుంది. దీనివల్ల మన సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. భవిష్యత్తులో మనకు హోమ్ లోన్ లేదా కార్ లోన్ కావాలన్నా బ్యాంకులు నిరాకరిస్తాయి, ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి.

మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, క్రెడిట్ కార్డును ఏటీఎంలలో పెట్టి నగదు డ్రా చేయడం. ఇలా చేసిన మరుసటి క్షణం నుండే భారీ వడ్డీలు, అదనపు ఛార్జీలు పడతాయి. దీనికి సాధారణ కొనుగోళ్లకు ఉండే 40-50 రోజుల గడువు వర్తించదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేయకూడదు. ఒకటికి మించి ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడటం కూడా అనవసరం. అవి వాడినా వాడకపోయినా వార్షిక ఛార్జీలు పడుతూనే ఉంటాయి.

చివరగా చెప్పేదేమిటంటే, క్రెడిట్ కార్డు అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని సరైన పద్ధతిలో వాడితే మేలు జరుగుతుంది, లేదంటే మన ఆర్థిక పరిస్థితిని ముక్కలు చేస్తుంది. ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా కట్టేయడానికి ప్రయత్నించండి. మినిమం డ్యూ అనే ట్రాప్‌లో పడకండి. అనవసరమైన క్రెడిట్ కార్డులను బ్యాంకుకు వెళ్లి ఎన్ఓసి తీసుకుని క్లోజ్ చేయడం మంచిది. క్రమశిక్షణతో కూడిన ఖర్చులే మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయి.

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు