
ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంత యువత కొంత మంది వస్తు రవాణాకు అనుగుణంగా ఉండే టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేసి వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అయితే వారికి టాటా ఏస్ నిర్వహణ ఖర్చు ముఖ్యంగా డీజిల్ ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ ఖర్చును తగ్గించుకునేలా ఓ కంపెనీ ఈవీ కిట్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ ఐసీఈ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి రూపొందించిన రెట్రోఫిట్ కిట్‌ను సన్ మొబిలిటీ బ్లూవీల్ భాగస్వామ్యంతో విడుదల చేసింది. ఈ కొత్త ఈవీల భారీ ధర లేకుండా ఫ్లీట్ ఆపరేటర్లు ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడాన్ని సులభతరం చేస్తుందని ఆ కంపెనీల ప్రతినిధలు చెబతున్నారు.
సన్ మొబిలిటీకు సంబంధించిన బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని సమగ్రపరచడం ద్వారా ఈ కిట్లు టాటా ఏస్ వాహనాలను మార్చుకోదగిన బ్యాటరీలతో ఎలక్ట్రిక్ యూనిట్లుగా పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. తద్వారా గణనీయమైన ఖర్చు ఆదాతో పాటు కార్యాచరణ ప్రయోజనాలను పొందవచ్చు. రెట్రోఫిట్ కిట్లు మొదట ఎన్‌సీఆర్ ప్రాంతంలో అందుబాటులో ఉంటాయి. భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. ఈవీ రెట్రోఫిట్టింగ్ అంటే పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చే ప్రక్రియ. అంతర్గత దహన యంత్రాన్ని ఎలక్ట్రిక్ మోటారుతో భర్తీ చేసి బ్యాటరీ ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ మార్పిడిలో వాహన అసలు నిర్మాణం, డిజైన్‌ను అలానే ఉంచుతూ మోటారు, బ్యాటరీ, తరచుగా కొత్త నియంత్రణ వ్యవస్థ వంటి కొత్త భాగాలను అమరుస్తారు. ఈ విధానం బ్రాండ్-న్యూ ఈవీని కొనుగోలు చేయకుండా ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడానికి ఖర్చుతో కూడుకున్న మార్గాన్ని అందిస్తుంది.
సీఎన్‌జీ వాహనాల నుండి మారుతున్న ఫ్లీట్ ఆపరేటర్లు నెలవారీ ఖర్చులో దాదాపు 30 శాతం తగ్గింపును ఆశించవచ్చు. డీజిల్ నుండి మారుతున్న వారు 40 శాతం వరకు ఆదా పొందుతారు. ఈ మార్పిడి ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా ఇప్పటికే ఉన్న వాహనాల జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. కొత్త రెట్రోఫిట్ సొల్యూషన్ ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వైపు ప్రభుత్వ ప్రోత్సాహానికి అనుగుణంగా ఉంటుంది. బ్రాండ్-న్యూ వాహనాల్లో పెట్టుబడి పెట్టకుండా నియంత్రణ ప్రమాణాలను పాటించడానికి టాటా ఏస్ వాహనదారులకు ఆచరణాత్మక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి