Gas cylinder: గ్యాస్‌ వినియోగదారులకు న్యూఇయర్‌ షాక్‌.. దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు ఎల్పీజీ ధరలు.

|

Jan 01, 2023 | 10:07 AM

కొత్తేడాది తొలి రోజే గ్యాస్‌ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. దేశ్యాప్తంగా ఎల్పీజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా సిలిండర్‌పై రూ. 25 పెరిగింది. పెరిగిన ఈ గ్యాస్‌ ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి. అయితే పెరిగిన ఈ గ్యాస్‌ ధరలు కేవలం....

Gas cylinder: గ్యాస్‌ వినియోగదారులకు న్యూఇయర్‌ షాక్‌.. దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు ఎల్పీజీ ధరలు.
Gas Cylinder
Follow us on

కొత్తేడాది తొలి రోజే గ్యాస్‌ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు షాక్‌ ఇచ్చాయి. దేశ్యాప్తంగా ఎల్పీజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా సిలిండర్‌పై రూ. 25 పెరిగింది. పెరిగిన ఈ గ్యాస్‌ ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి. అయితే పెరిగిన ఈ గ్యాస్‌ ధరలు కేవలం వాణిజ్య సిలిండర్‌ ధరలు మాత్రమే పరిమితం. గ్రహ గ్యాస్‌ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో సామాన్యులకు ఊపిరి పిల్చుకున్నారు. దీంతో కమర్షియల్‌ సిలిండర్లపై నేటి నుంచి రూ. 25 అధికంగా చెల్లించాల్సి వచ్చింది.

పెరిగిన ధరల అనంతరం దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ. 1769, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ. 1721, కోల్‌కతాలో రూ. 1870, చెన్నైలో రూ. 1917, హైదరాబాద్‌లో రూ. 1973గా ఉన్నాయి. డొమొస్టిక్‌ సిలిండర్‌ ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో రూ. 1053, ముంబయిలో రూ. 1052.5, కోల్‌కతాలో రూ. 1079, చెన్నైలో రూ. 1068.5, హైదరాబాద్‌లో రూ. 1105గా ఉన్నాయి. ఇదలా ఉంటే డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరలు ఇటీవల స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారి జులై 6న రూ. 50 పెంచాలరు. ఇక గతేడాది మొత్తంగా చూస్తే గ్యాస్‌ ధర రూ. 153.5 పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..