మద్యం ప్రియులకు శుభవార్త. శీతల పానీయాల తయారీ కంపెనీ భారతదేశంలోని మద్యం మార్కెట్‌లోకి ప్రవేశించింది. నిజానికి శీతల పానీయాల ప్రపంచంలో దిగ్గజం కోకా కోలా భారతదేశంలో మొదటిసారిగా మద్యం విభాగంలోకి ప్రవేశించింది. కోకా కోలా తన లిక్కర్ బ్రాండ్ లెమన్ డోను విస్కీ మార్కెట్‌లో విడుదల చేసింది. దేశంలో ఎక్కడ విక్రయిస్తుంది..? దాని ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.
మద్యం ఎక్కడ విక్రయిస్తున్నారు?
కోకా కోలా కంపెనీకి చెందిన మద్యం ప్రస్తుతం గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. దీని 250 ml క్యాన్ ధర 230 రూపాయలుగా ఉంది.. కోకా కోలా లిక్కర్ సెగ్మెంట్‌లో మొదటిసారిగా బీర్‌ను విడుదల చేసింది దేశంలో మద్యం విక్రయించాలనే నిర్ణయాన్ని కోకా కోలా ఇండియా ధృవీకరించింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, లెమన్ డో పైలట్ టెస్టింగ్ జరుగుతోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇది ఇప్పటికే ప్రపంచంలోని అనేక మార్కెట్లలో అందుబాటులో ఉంది.
లెమన్ డూ అంటే ఏమిటి?
లెమన్ డో అనేది ఒక రకమైన ఆల్కహాల్ మిక్స్. ఇది షోషు నుండి తయారు చేయబడింది. ఇందులో వోడ్కా, బ్రాందీ వంటి డిస్టిల్డ్ లిక్కర్ ఉపయోగించబడుతుంది. కోకా కోలా ఇండియా ప్రతినిధి ప్రకారం.. ఇది వివిధ ప్రదేశాలలో తయారు జరుగుతుంది.
వారి చూపు మద్యం మార్కెట్‌పైనే
శీతల పానీయాల మార్కెట్‌ను పూర్తిగా కైవసం చేసుకున్న తర్వాత, గ్లోబల్ కంపెనీలు కోక్, పెప్సీలు ఇప్పుడు మద్యం విభాగంపై కన్నేసింది. రెండు కంపెనీలు ఒక్కొక్కటిగా ఈ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. కోక్ గతంలో జపాన్‌లో కూడా లెమన్ డో ఉత్పత్తిని విడుదల చేసింది. పెప్సికో అమెరికన్ మార్కెట్‌లో మౌంటెన్ డ్యూ ఆల్కహాలిక్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. ఇటీవల కోకా కోలా రూ. 3300 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి