
కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్ ( సీఎన్జీ) అనేది పర్యావరణానికి హాని కలిగించని ఇంధనం. దీన్ని కార్లలో ఎక్కువగా వినియోగిస్తారు. దీని నుంచి కాలుష్య ఉద్గారాలు వెలువడవు. తద్వారా పర్యావరణానికి రక్షణ కలుగుతుంది. పెట్రోలు, డీజిల్ తో పోల్చితేే సీఎన్జీ ధర తక్కువ కావడంతో వినియోగదారులకు ఉపయోగంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనితో నడిచే బైక్ ను బజాజ్ కంపెనీ రూపొందించింది. బజాజ్ పల్సర్ 150 సీఎన్జీ బైక్ సొగసైన లుక్ తో ఆకట్టుకుంటోంది. పల్సర్ సిరీస్ లోని ఐకానిక్ స్లైల్ కు అనుగుణంగా తయారైంది. అధిక నాణ్యత కలిగిన పరికరాలు, చక్కగా అమర్చిన భాగాలు, ఆధునాతన రూపం, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేకులతో ఆకర్షణీయంగా ఉంది. దీనిలోని డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లో వేగం, ఇంధనం గేజ్, ట్రిప్ సమాచారమంతా తెలుసుకోవచ్చు. ఎర్గోనామిక్ సీటు, ఎడ్జెస్టబుల్ సస్పెన్షన్ బాగున్నాయి. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని రకాల రోడ్లపైనా పరుగులు తీయడం దీని ప్రత్యేకత.
సీఎన్జీ శక్తితో పనిచేసే 149.5 సీసీ ఇంజిన్ ను కొత్త బైక్ లో ఏర్పాటు చేశారు. దీని నుంచి 14 బీహెచ్పీ, 13.25 గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. సంప్రదాయ పెట్రోలు ఇంజిన్ల కంటే ఎక్కువ సామర్థ్యంలో పనిచేస్తుంది. పెట్రోలుతో పోల్చితే ప్రయాణానికి ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. సంప్రదాయ పెట్రోలు వాహనం మాదిరిగానే పనితీరు ఉంటుంది. ఇంధన ఖర్చులను ఆదా చేయాలనుకునే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
సీఎన్జీ టెక్నాలజీ కారణంగా నిర్వహణ ఖర్చులతో పాటు కాలుష్య ఉద్గారాల విడుదల తగ్గుతుంది. దాని వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. పెట్రోలుతో పోల్చితే సీఎన్జీ శుభ్రమైన ఇంధనం. పర్యావరణానికి హాని కలిగించకుండా రైడింగ్ కోరుకునే వారికి బజాజ్ పల్సర్ 150 సీఎన్జీ ఎంతో అనుకూలంగా ఉంటుంది. మిగిలిన బజాజ్ వాహనాల మాదిరిగానే సీఎన్జీ వాహనాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులో ధరలో తీసుకురానున్నట్టు సమాచారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి