CNG Price: మళ్లీ పెరిగిన CNG గ్యాస్ ధరలు.. అక్టోబర్‌లో ఇది రెండోసారి..

|

Oct 13, 2021 | 7:50 AM

CNG Price: వాహనాల్లో నింపే CNG (Compressed natural gas) గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంగా

CNG Price: మళ్లీ పెరిగిన CNG గ్యాస్ ధరలు.. అక్టోబర్‌లో ఇది రెండోసారి..
Cng Gas
Follow us on

CNG Price: వాహనాల్లో నింపే CNG (Compressed natural gas) గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంగా నేచురల్, లిక్విడ్‌ గ్యాస్‌లకు డిమాండ్‌ పెరిగింది. పెట్రోల్, డీజిల్‌ ధరల దరిదాపుల్లోకి ఇదీ చేరుకుంటుంది. అంతేకాదు అక్టోబర్‌ పెరగడం ఇది రెండోసారి. ఈ రోజు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ CNG ధరను కిలోకు రూ .2.28 పెంచుతున్నట్లు ప్రకటించింది. CNG గ్యాస్ పెరిగిన ధర అక్టోబర్ 13 నుంచి అంటే ఈ రోజు నుంచి వర్తిస్తుంది.

అక్టోబర్ 13 ఉదయం 6 గంటల నుంచి కొత్త ధర వర్తిస్తుంది. ధర పెరిగిన తరువాత ఢిల్లీలో CNG గ్యాస్ ధర కిలోకు 49.76లు ఉంది. నోయిడాలో కిలో రూ.56.02, గురుగ్రామ్‌లో రూ.58.20, రేవారి రూ.58.90, కైతల్ రూ.57.10, ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ రూ.63.28, ఫతేపూర్, హమీర్‌పూర్ రూ.66.54, అజ్మీర్, పాలి, రాజసమంద్ కిలోకు రూ. 65.02 వరకు ఉంది.

వాస్తవానికి, సెప్టెంబర్ 30న ప్రభుత్వం సహజ వాయువు లేదా గృహవాయువు ధరలో 62 శాతం పెరుగుదలను ప్రకటించింది. అక్టోబర్ 2 న ఢిల్లీలో CNG కిలో ధర రూ.2.28 పెరిగింది. పైపుల ద్వారా గృహాలకు చేరే వంట గ్యాస్ (PNG) ధర 2.10 రూపాయలు పెరిగింది. 2012 తర్వాత సిఎన్‌జి ధరలలో ఇదే అత్యధిక పెరుగుదల. ఢిల్లీతో పాటు, నోయిడా, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడాలో CNG గ్యాస్ ధర కిలోకు రూ.2.55 పెరిగింది. PNG ధర క్యూబిక్ మీటర్‌కు రూ .2.10 పెరిగింది.

వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు తరువాత, సహజ వాయువు ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రతి ఆరు నెలలకు గ్యాస్ ధరలను సమీక్షించడం ద్వారా ప్రభుత్వం ధరను నిర్ణయిస్తుంది. సహజవాయువు ధర పెరుగుదలతో, ఎరువుల కంపెనీల ధర కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ కంపెనీలు ఎరువును తయారు చేయడానికి సహజ వాయువును ఉపయోగిస్తాయి. అయితే ప్రభుత్వం దీని కోసం సబ్సిడీని ఇస్తుంది కాబట్టి ప్రస్తుతానికి దీని ధర పెరిగే అవకాశం లేదు.

ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్‌ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్‌జీ, లిక్విడ్‌ గ్యాస్‌ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి. తెలంగాణలోని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 460 పైగా పెట్రోల్‌ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్‌ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 25 కేంద్రాలో నేచురల్‌ గ్యాస్‌ కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. మొత్తం మీద మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన బంకులతో పాటు టోటల్, రిలయన్స్‌ బంకులు సైతం ఉన్నాయి. మూడు నాలుగు లక్షల వాహనాలు సీఎన్‌జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

అధిక మైలేజీ వల్లే డిమాండ్‌
పెట్రోల్, డీజిల్‌ కంటే సీఎన్‌జీ, ఆటో గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్‌ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్‌జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలో ఒక్కంటికి 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. దీంతో వీటి ధర పెరిగినా డిమాండ్‌ ఏమాత్రం తగ్గడంలేదు.

Viral Photos: వీళ్ల టెక్నిక్‌ల ముందు ఇంజ‌నీర్ల తెలివి కూడా ప‌నికిరాదు..! ఫొటోలు చూస్తే షాక్ అవుతారు..