దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడికి తీవ్ర భారంగా మారుతోంది. ఇక ఢిల్లీలో సిఎన్‌జి, పిఎన్‌జి ధరలు శనివారం మూడు రూపాయలు పెరిగాయి. అక్టోబర్ 1 నుంచి సహజవాయువు ధరను 40 శాతం మేరకు పెరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ముంబై పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరను కిలోకు 6 రూపాయలు పెంచింది. దీంతోపాటు పైపుల ద్వారా సరఫరా చేసే పీఎన్‌జీ ధరలను కూడా యూనిట్‌కు రూ.4 చొప్పున పెంచారు. సోమవారం నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. దీని తర్వాత శనివారం ఢిల్లీలో ఐసీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు ఇలా ఉన్నాయి. మార్చి 7, 2022 నుండి ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు 14 సార్లు కిలోకు 22.60 రూపాయలు పెరిగాయి. చివరిసారిగా మే 21న సీఎన్‌జీ ధర కిలోకు రూ.2 పెరిగింది. డేటా ప్రకారం.. ఏప్రిల్ 2021 నుండి ఇప్పటివరకు ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు 35.21 రూపాయలు (సుమారు 80 శాతం) పెరిగింది.
ముంబైలో గ్యాస్ ధర
ఇటీవల మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సీఎన్‌జీ ధరపై 6 రూపాయలు, పీఎన్‌జీ ధర యూనిట్‌కు 4 రూపాయలు పెంచింది. దీంతో సిఎన్‌జి రిటైల్ ధర కిలోకు రూ.86కి, పిఎన్‌జికి ఎస్‌సిఎంకు రూ.52.50కి పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఇప్పుడు సీఎన్‌జీ, పెట్రోల్ మధ్య ధర వ్యత్యాసం 45% కి తగ్గింది. ఆగస్టు 2021 నుండి ఇప్పటి వరకు పీఎన్‌జీ ధర పది రెట్లు పెరిగింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ఇతర నగరాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెరిగాయి.
ఇటీవల పెరిగిన గ్యాస్ ధరలు
గత నాలుగు నెలల్లో తొలిసారిగా సీఎన్‌జీ ధరను పెంచగా, గత రెండు నెలల్లో తొలిసారిగా పీఎన్‌జీ (పైప్డ్ గ్యాస్) ధరను పెంచారు. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఢిల్లీలో సిఎన్‌జి ధర కిలోకు రూ.75.61 నుండి రూ.78.61కి పెరిగింది. అదే సమయంలో, పీఎన్‌జీ ధర ఇప్పుడు ఢిల్లీలో (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్) రూ. 50.59 నుండి రూ. 53.59కి పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి